ధోనీకి స్పెషల్ విషెస్ చెప్పిన ఐసీసీ

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్డీ పుట్టినరోజు సందర్భంగా క్రీడాకారులతో పాటు కోట్లాది మంది అభిమానులు ధోనికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో తనదైన తరహాలో విష్...

ధోనీకి స్పెషల్ విషెస్ చెప్పిన ఐసీసీ

Updated on: Jul 07, 2020 | 2:40 PM

ICC Wishes to MS Dhoni : ఈ రోజు సోషల్ మీడియా మొత్తం ఒకటే పేరు కనిపిస్తోంది.. అదే ధోనీ.. ధనాధన్ ధోనీ.. కూల్ కెప్టెన్ ధోనీ.. అంతా ధోనీ జపం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా నిండిపోతోంది. ఇప్పటికే ట్విట్టర్ మొత్తం ధోనీ బర్త్ డే విషెస్ ట్వీట్లతో ఫుల్ అయ్యింది.

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్డీ పుట్టినరోజు సందర్భంగా క్రీడాకారులతో పాటు కోట్లాది మంది అభిమానులు ధోనికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో తనదైన తరహాలో విష్ చేసింది ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ). ధోని బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియోలో స్టేడియంలోకి ధోనీ ఎంట్రీ నుంచి ధనాధన్ బ్యాటింగ్‌ విజువల్స్‌ ఉన్నాయి. వీటితోపాటు ధోని గురించి బెన్‌స్టోక్స్‌, కోహ్లి, సచిన్‌ టెండూల్కర్‌, బౌలర్‌ భూమ్రా మాట్లాడుతున్న క్లిప్పింగ్‌లను జతచేసింది. ఈ ట్వీట్‌కు ‘‘ఎవరైనా అతడిలాగే మంచివారని నేను అనుకోను’’ అనే ట్యాగ్‌ను జోడించింది.