టెస్ట్ ఛాంపియన్ షిప్: ఆసీస్ ప్లేయర్స్ జోరు..

|

Aug 12, 2020 | 9:53 PM

ఐసీసీ ప్రతిష్టాత్మకమైన నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఆస్ట్రేలియా బౌలర్ల హావా కొనసాగుతోంది. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ నిలవగా..

టెస్ట్ ఛాంపియన్ షిప్: ఆసీస్ ప్లేయర్స్ జోరు..
Follow us on

ICC Test Championship: ఐసీసీ ప్రతిష్టాత్మకమైన నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఆస్ట్రేలియా బౌలర్ల హావా కొనసాగుతోంది. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ నిలవగా.. టాప్ 10 లిస్టులో మాత్రమే ఆస్ట్రేలియా జట్టు నుంచి నలుగురు బౌలర్లు ఉండటం విశేషం. స్టువర్ట్ బ్రాడ్.. 19.50 యావరేజ్‌తో 59 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ సంచలనం ప్యాట్ కమ్మిన్స్ 49 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

ఇక ఆ తర్వాత నాథన్ లియాన్ 47 వికెట్లు, మహమ్మద్ షమీ 36 వికెట్లు, జోఫ్రా ఆర్చర్ 36 వికెట్లు, టిమ్ సౌధీ 33 వికెట్లు, మిచెల్ స్టార్క్ 33 వికెట్లు, హేజిల్‌వుడ్‌ 31 వికెట్లు, ఇషాంత్ శర్మ 30 వికెట్లు, బెన్ స్టోక్స్ 29 వికెట్లు తీశారు. కాగా, ప్రస్తుతం ఇండియా 360 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.