క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. మినీ వరల్డ్ కప్ గా భావించే ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోపీ షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం (డిసెంబర్ 24) ప్రకటించింది. ఈ మేరకు ఐసీసీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. నిజానికి ఈ టోర్నీ షెడ్యూల్ ఇప్పటికే విడుదలై ఉండాల్సింది. కానీ టోర్నీ నిర్వహణ విషయంలో భారత్, ఆతిథ్య పాకిస్థాన్ మధ్య నెలకొన్న గందరగోళం కారణంగా ఈ షెడ్యూల్ విడుదల కాలేదు. ఎట్టకేలకు ఈ రెండు దేశాల డిమాండ్లను పరిగణణలోకి తీసుకున్న ఐసీసీ మంగళవారం టోర్నీ అధికారిక షెడ్యూల్ ను రిలీజ్ చేసింది .ఈ టోర్నీలో ఫైనల్‌తో కలిపి మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 8 జట్లు ఈ టోర్నీలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. ఈ 8 జట్లను 4-4 ప్రకారం 2 గ్రూపులుగా విభజించారు. ICC విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్, ఆతిథ్య పాకిస్తాన్ జట్ల మధ్య కరాచీ వేదికగా జరుగుతుంది. మార్చి 9న ఫైనల్ జరగనుంది. టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఇక టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య హైవోల్టేజీ మ్యాచ్ జరగనుంది. లీగ్ రౌండ్లో చివరి మ్యాచ్‌లో భారత్ మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది.
Check out the full fixtures for the ICC Champions Trophy 2025. pic.twitter.com/oecuikydca
— ICC (@ICC) December 24, 2024
Here’s Team India’s schedule for the exciting ICC Champions Trophy 2025! 🏆🇮🇳
They kick off their campaign against Bangladesh in Dubai on February 20th! 🤩#ChampionsTrophy #India #ODIs #RohitSharma #Sportskeeda pic.twitter.com/bDy05j0EPJ
— Sportskeeda (@Sportskeeda) December 24, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..