”జీవితం మార్కుల కంటే విలువైనది”.. ఐఏఎస్ సూపర్బ్ ట్వీట్..

మార్కులు, ఫలితాలే జీవితం కాదని.. అవి మన జీవితాన్ని నిర్ణయించలేవని.. వందేళ్ల నీ జీవితాన్ని వంద మార్కులతో కొలమానం చేయవద్దని ఓ ఐఏఎస్ అధికారి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జీవితం మార్కుల కంటే విలువైనది.. ఐఏఎస్ సూపర్బ్ ట్వీట్..

Updated on: Jul 16, 2020 | 1:40 AM

IAS Officer Tweet Viral: అందరి కంటే ఫస్ట్ ఉండాలి. లేదంటే మనం వెనకబడిపోతాం. చదువులో మొదటి ర్యాంక్ రాకపోతే ఉద్యోగం సాధించలేం అంటూ ఈ పోటీ ప్రపంచంలో విద్యార్ధులపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నారు. దీన్ని తట్టుకోలేక చాలామంది స్టూడెంట్స్ డిప్రెషన్‌లో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అయితే మార్కులు, ఫలితాలే జీవితం కాదని.. అవి మన జీవితాన్ని నిర్ణయించలేవని.. వందేళ్ల నీ జీవితాన్ని వంద మార్కులతో కొలమానం చేయవద్దని ఓ ఐఏఎస్ అధికారి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుజరాత్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నితిన్ సంగ్వాన్ తన ఇంటర్ మార్క్స్ షీట్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. తనకు 12వ తరగతి కెమిస్ట్రీలో కేవలం 24 మార్కులు మాత్రమే వచ్చాయని.. అంటే పాస్ మార్క్ కంటే ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకున్నానని పేర్కొన్నాడు. అంత తక్కువ మార్కులు వచ్చినా కూడా సివిల్స్ సాధించి.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యానంటూ ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

”మార్కుల భారాన్ని పిల్లలపై మోపి వారిని బాధపెట్టకండి. బోర్డు రిజల్ట్స్ వందేళ్ల జీవితాన్ని నిర్ణయించలేవు. మార్కులను కేవలం ఆత్మపరిశీలను ఓ అవకాశం భావించండి. అంతేగానీ విమర్శించకండి. అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం నితిన్ సంగ్వాన్ అహ్మదాబాద్‌ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

Also Read: పవన్‌ను పొగుడుతూ అలీ ట్వీట్.. జనసైనికులు ఆగ్రహం..