ఆర్మీలో చేరాలనుకొని.. అనుకోకుండా ప్రధానినయ్యా: మోదీ

ప్రధాని అవుతానని తాను ఎప్పుడూ అనుకోలేదని నరేంద్ర మోదీ అన్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రముఖుల జీవితాలను చదవడం తనకు చాలా ఇష్టమని.. తాను కఠినంగా ఉంటానని కానీ ఎవరినీ అవమానించనని అన్నారు. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం, ఒత్తిళ్లలో పనిచేయడం కూడా అలవాటుగా పెట్టుకున్నానని తెలిపారు. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని అనుకున్నానని, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ […]

ఆర్మీలో చేరాలనుకొని.. అనుకోకుండా ప్రధానినయ్యా: మోదీ

Updated on: Apr 24, 2019 | 12:00 PM

ప్రధాని అవుతానని తాను ఎప్పుడూ అనుకోలేదని నరేంద్ర మోదీ అన్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రముఖుల జీవితాలను చదవడం తనకు చాలా ఇష్టమని.. తాను కఠినంగా ఉంటానని కానీ ఎవరినీ అవమానించనని అన్నారు. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం, ఒత్తిళ్లలో పనిచేయడం కూడా అలవాటుగా పెట్టుకున్నానని తెలిపారు. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని అనుకున్నానని, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇప్పటికీ తన తల్లికి సమయం కేటాయిస్తానని వెల్లడించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us