మీ స్నేహితులకు క్రిస్మస్ శుభాకాంక్షలను వైరటీగా చెప్పాలనుకుంటున్నారా ?.. ప్రత్యేక స్టిక్కర్స్‏ను ఇలా పంపండి..

|

Dec 24, 2020 | 7:30 PM

క్రిస్మస్ పండుగ రోజున మీ స్నేహితులకు గుర్తుండిపోయేలా శుభాకాంక్షలను చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇలా ప్రత్యేక స్టిక్కర్స్‏ను పంపించి వాళ్ళను

మీ స్నేహితులకు క్రిస్మస్ శుభాకాంక్షలను వైరటీగా చెప్పాలనుకుంటున్నారా ?.. ప్రత్యేక స్టిక్కర్స్‏ను ఇలా పంపండి..
Follow us on

క్రిస్మస్ పండుగ రోజున మీ స్నేహితులకు గుర్తుండిపోయేలా శుభాకాంక్షలను చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇలా ప్రత్యేక స్టిక్కర్స్‏ను పంపించి వాళ్ళను సర్‏ప్రైజ్ చేయండి. ప్రముఖ మేసెజింగ్ సంస్థ వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్స్‏ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలే స్టిక్కర్ సెర్చ్ వంటి నూతన అప్‏డేట్‏లను తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే వాట్సప్ చాలా రకాల స్టిక్కర్ ప్యాక్‏లను అందిస్తుంది. ఏదైన స్పెషల్ డేస్‏కు సంబంధించిన స్టిక్కర్స్ కోసం ఇక నుంచి వేరే ప్రత్యేక యాప్‏లను డౌన్ లోడ్ చేయవలసిన అవసరం లేదు. క్రిస్మస్ పండగ సందర్బంగా మీ స్నేహితులకు గానీ, బంధువులకు అందమైన వెరైటీ స్టిక్కర్స్‏ను పంపడానికి కొన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని సులువైన ప్రత్యేక యాప్‏లకు సంబంధించిన వివరాలను మీకు తెలియజేయడానికి మీ ముందుకు తీసుకువస్తున్నాం. మీ సన్నిహితులకు క్రిస్మల్ లేదా నూతన సంవత్సర ప్రత్యేక స్టిక్కర్‏లను ఎలా పంపించాలో తెలుసుకోండి.

క్రిస్మస్ స్టిక్కర్స్ పంపడం..
ముందుగా గూగుల్ ప్లే స్టోర్‏లో వాట్సాప్ క్రిస్మస్ స్టిక్కర్స్ అని టైప్ చేయండి. ఆ తర్వాత మీకు ప్లే స్టోర్‏లో చాలా రకాల యాప్స్ కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన యాప్స్ లేదా క్రిస్మస్ స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్ (వాస్టిక్కర్ ఆప్), క్రిస్మస్ స్టిక్కర్ ప్యాక్ 2020 అనే యాప్‏లను డౌన్‏లోడ్ చేసుకోండి. ఈ యాప్స్ ఓపెన్ చేసాక ఇందులో చాలా రకాల క్రిస్మస్, న్యూ ఇయర్‍కు సంబంధించిన స్టిక్కర్లు కనిపిస్తాయి. ఇందులో మీకు నచ్చిన వాట్సాప్ స్టిక్కర్‏లను సెలక్ట్ చేసుకోని, మీరు స్టిక్కర్ విండోలో ఉన్న + బటన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇంకా స్టిక్కర్లు ఆడ్ చేయాలనుకుంటే ADD బటన్ పై క్లిక్ చేయండి. అంతే మీకు వాట్సాప్‏లో యాప్‏లో కొత్త క్రిస్మస్ స్టిక్కర్లు కనిపిస్తాయి. ఈ ప్రత్యేకమైన స్టిక్కర్లను ఎవరికైతే పంపిచాలని అనుకుంటున్నారో వారి చాట్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత టైపింగ్ బార్‏లో ఉన్న స్మైలీ ఐకాన్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన స్టిక్కర్లను సెలెక్ట్ చేసుకొని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసి ఈ క్రిస్మస్ పర్వదినాన్ని మరింత సంబంరంగా జరుపుకొండి.