రక్తం రుచి మరిగిన పులిని ఎలా పట్టారంటే.. ?

జంతువులతో బాటు మనుషుల రక్తం రుచి మరిగిన పెద్ద పులిని పట్టడానికి అటవీ అధికారులు అతి పెద్ద ప్రయత్నమే చేశారు. ఆరు రోజులు ముప్పు తిప్పలు పెట్టిన ఈ పులి ఎట్టకేలకు పట్టుబడింది. అది కర్నాటకలోని బండిపూర్ రిజర్వ్ అటవీ ప్రాంతం. ఇలా కనబడి.. అలా దాడి చేసి ఇట్టే మాయమయ్యే ఈ క్రూర జంతువు ఇద్దరు గ్రామస్థులను చంపి తిన్నదట. మరో 18 పశువులు కూడా దానికి ఆహారంగా మారిపోయాయి. దీన్ని పట్టి బంధించడానికి అటవీ […]

రక్తం రుచి మరిగిన పులిని ఎలా పట్టారంటే.. ?

జంతువులతో బాటు మనుషుల రక్తం రుచి మరిగిన పెద్ద పులిని పట్టడానికి అటవీ అధికారులు అతి పెద్ద ప్రయత్నమే చేశారు. ఆరు రోజులు ముప్పు తిప్పలు పెట్టిన ఈ పులి ఎట్టకేలకు పట్టుబడింది. అది కర్నాటకలోని బండిపూర్ రిజర్వ్ అటవీ ప్రాంతం. ఇలా కనబడి.. అలా దాడి చేసి ఇట్టే మాయమయ్యే ఈ క్రూర జంతువు ఇద్దరు గ్రామస్థులను చంపి తిన్నదట. మరో 18 పశువులు కూడా దానికి ఆహారంగా మారిపోయాయి. దీన్ని పట్టి బంధించడానికి అటవీ అధికారులు ‘ చుక్కలు చూడాల్సి వచ్చింది ‘. బెంగుళూరుకు సుమారు 200 కి. మీ. దూరంలోని ఈ ఫారెస్ట్ రేంజిలో గల నాగువనహళ్లి గ్రామమది.. తమకు కంటి నిద్ర లేకుండా చేస్తున్న ఈ పులిని ఎలాగైనా చంపి తీరాలన్నదే ఆ గ్రామస్థుల అభిమతం. ఇక–వందమంది అటవీ అధికారులు పెద్ద వ్యూహమే పన్నారు. వీరు ఆ ప్రాంతంలోని సోలిగ జాతి గిరిజనుల సహకారం తీసుకోవడమే కాదు.. ఆరు ఏనుగులను, ప్రత్యేక శిక్షణ పొందిన జర్మన్ షెఫర్డ్ కుక్కను కూడా తమ వెంట తీసుకువెళ్లిఅతి పెద్దదైన అటవీ ప్రాంతంలో ఆ పులి ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించారు. కానీ దాని జాడ కనుక్కోవడం వారికి అంత సులభం కాలేదు. ఆ పులిని పట్టడం కాదు.. దాన్ని చంపి తీరాలన్న గ్రామస్థులు. వారి ప్రయత్నానికి అడ్డు తగలడంతో అధికారులకు అది ఓ పెద్ద సవాలుగా మారింది. కానీ.. వారు వెనుకంజ వేయకుండా గిరిజనుల సాయంతో అడవిలో అనేక చోట్ల సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయించారు. వారి భగీరథ ప్రయత్నంతో ఈ పులి ఆచూకీ ఈ నెల 12 న తెల్లవారు జామున నాలుగున్నర గంటల ప్రాంతంలో ఓ పొదల్లో కనిపించింది. మూడు ఏనుగులు, శునకం దాన్ని చుట్టుముడుతుండగా అది తప్పించుకుని మరో పొదలో దూరింది. అయితే అధికారులు సుమారు గంటపాటు కష్టపడి ట్రాంక్వి లైజర్ సాయంతో అది స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ పెద్దపులిని అతి పెద్ద వలతో బంధించి మైసూరు జూకు తరలించారు. ఇన్నాళ్లుగా తమను హడలెత్తిస్తున్న ఈ క్రూర జంతువు పట్టుబడడంతో గ్రామస్థులతో బాటు అటవీ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.