ఆ హాస్పిటల్లో నర్సులందరికీ క్వారెంటైన్

అదో ప్రైవేటు ఆసుపత్రి.. కొన్ని రోజులుగా చాలా మామూలుగా రోగులకు చికిత్స అందిస్తున్నారు మెడికల్ స్టాఫ్. కానీ ఒక్కరోజు వ్యవధిలో ఆ ప్రైవేటు ఆసుపత్రిలో సీన్ మారిపోయింది. కారణం ఆ ఆసుపత్రికి చెందిన ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ రావడమే కారణం.

  • Rajesh Sharma
  • Publish Date - 3:52 pm, Fri, 10 April 20
ఆ హాస్పిటల్లో నర్సులందరికీ క్వారెంటైన్

ముంబైలోని ఓ ఆసుపత్రిలోని నర్సులందరికీ కరోనా ముప్పు ముంచుకొచ్చింది. ఆస్పత్రిలోని ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ నమోదవడంతో… మిగిలిన నర్సులందరికీ హోం క్వారెంటైన్‌కు తరలించారు. దాంతో సదరు ఆసుపత్రిలోని నర్సులందరి ప్రాణభయంతో భీతిల్లిపోతున్నారు.

ముంబై నగరంలోని దాదార్‌లోని సుశ్రుషా ఆసుపత్రి నర్సులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఆసుపత్రిలో పని చేసే ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ రావడంతో చర్యలు చేపట్టారు. కొత్తగా రోగులెవరిని చేర్చుకోవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఉన్న రోగులను 48 గంటల్లో డిశ్చార్జి చేయాలని నిర్ణయించారు. క్వారంటైన్‌కు పంపిన నర్సులందరికీ కరోనా టెస్టులు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు.

ఆసుపత్రి నర్సులకు కరోనా పాజిటివ్ రావడంతో గత పదిహేను రోజులుగా ఆసుపత్రిని సందర్శించిన రోగులందరూ ప్రస్తుతం కరోనా టెన్షన్‌లో పడిపోయారు. దానికి తోడు నర్సులతోపాటు ఆసుపత్రిలో పని చేసిన.. మెడికల్ సిబ్బందిని కూడా క్వారెంటైన్‌లో వుంచి… కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని తలపెట్టారు.