హైదరాబాద్ శివారులో శాటిలైట్ బస్ టెర్మినల్

హైదరాబాద్ అభివ‌ృద్దిపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇంటర్నేషనల్ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా....

హైదరాబాద్ శివారులో శాటిలైట్ బస్ టెర్మినల్
Follow us

|

Updated on: Jul 17, 2020 | 11:23 AM

Satellite Bus Terminal at Vanasthalipuram : హైదరాబాద్ అభివ‌ృద్దిపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇంటర్నేషనల్ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. నగర శివారులో అత్యాధునిక హంగులతో శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) సన్నద్ధమవుతోంది.

సుమారు రూ.18 కోట్ల అంచనా వ్యయంతో వనస్థలిపురం పరిధిలో ఏర్పాటు చేసేందుకు ప్లాన్‌ను రెడీ చేసింది. మహావీర్‌ హరిణ వనస్థలి జింకల పార్కు సమీపంలో 1.2 కిలోమీటర్ల పరిధిలో నిర్మించనుంది. ఈ ప్రాంతం ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పరిధిలో ఉండటంతో.. అనుమతులు రావడంతోనే పనులకు శ్రీకారం చుట్టేందుకు చూస్తోంది.

శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ చేయడం వల్ల ఎల్బీనగర్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్యకు చెక్ పెట్టినట్లవుతుంది అక్కడి ప్రజాప్రతినిధుల అంచనా. నిత్యం ఎల్బీనగర్‌ బస్టాప్‌ నుంచి రోజూ 25 వేల నుంచి 30 వేల మంది నల్గొండ, ఖమ్మం, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంకు జర్నీ చేస్తుంటారు. ఎల్బీనగర్ మీదుగా 600 నుంచి 700 వరకు ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు వెళ్తుంటాయి. దీంతో ఇక్కడ ట్రాఫిక్‌ సమస్య అధికంగా ఉంది.  1.2 కి.మీ. విస్తీర్ణంలో హెచ్‌ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి డిజైన్లను రూపొందించారు. వచ్చే నెలలోనే పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నారు.