International Cricket 2020: గతేడాదిలో ఒకవైపు కరోనా కారణంగా అన్ని క్రికెట్ టోర్నమెంట్లు వాయిదా పడగా.. మరోవైపు బయోబబుల్ బుడగలో ఐసీసీ నిర్వహించింది అతి కొద్ది సిరీస్‌లు మాత్రమే. అయినా కూడా ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
2020లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 944 పరుగులతో ఫించ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే టెస్టుల్లో ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్(644).. వన్డేల్లో ఫించ్(673), టీ20లలో పాకిస్థాన్ ప్లేయర్ మహమ్మద్ హఫీజ్(415) అత్యధిక రన్స్ చేశాడు.