వనస్థలిపురంలో తప్పిన ప్రమాదం..

హైదరాబాద్ శివారులో పెద్ద ప్రమాదం తప్పింది. వనస్థలిపురం ఓంకార్ నగర్ సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో 220 కేవిఏ హైటెన్షన్ వైర్లు తెగి రోడ్డుపక్కనే పడ్డాయి...

వనస్థలిపురంలో తప్పిన ప్రమాదం..

Updated on: Aug 12, 2020 | 11:13 PM

హైదరాబాద్ శివారులో పెద్ద ప్రమాదం తప్పింది. వనస్థలిపురం ఓంకార్ నగర్ సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో 220 కేవిఏ హైటెన్షన్ వైర్లు తెగి రోడ్డుపక్కనే పడ్డాయి. ఈ సమయంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

హైటెన్షన్ వైర్లు తెగిపోవడంతో ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇదే సమయంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతం విద్యుత్ అధికారులు అక్కడి చేరుకుని మరమ్మత్తులు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us