
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని..రీసెంట్ టైమ్స్‌లో ట్విట్టర్లో యమ యాక్టీవ్ అయ్యాడు. కేవలం తన సినిమాలకు సంబందించి అబ్డేట్స్ మాత్రమే కాదు..సామాజిక అంశాల పట్ల కూాడా స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను ఉటంకిస్తూ రామ్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నేడు సచిన్ పుట్టినరోజును జరుపుకుంటున్న వేళ, ఆయన ఇంటర్ కూడా పూర్తి చేయలేదని, అయినా దేశానికే గర్వకారణంగా నిలిచారని చెప్తూ విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపే ప్రయత్నం చేశాడు యువ హీరో.
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, “పార్క్ లో కూర్చొని బిస్కట్లు తినే పిల్లలకి ఎలా చెప్పినా వింటారు. కానీ బెడ్ రూమ్ లో లాక్ వేసుకుని జీవితం ఎలారా? అనుకునే పిల్లలకు నిజాలు ఇలా చెబితేనే వింటారు. ఇంటర్ కూడా పూర్తి చేయని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు జన్మదిన శుభాకాంక్షలు” అని వ్యాఖ్యానించాడు. దీనికి ‘ఇంటర్ బోర్డ్ మర్డర్స్’ అన్న ట్యాగ్ కూడా తగిలించాడు. ఇక నిన్న తనని తాను ఉదాహరణగా చెప్పుకున్నాడు రామ్. ఇంటర్ రిజల్ట్స్ మాత్రమే జీవితం అనుకోకండి..లైఫ్‌లో అవ్వబోయేదానికి, చేయబోయేదానికి ఇది సిల్లీ థింగ్.. లైట్ తీస్కోండి..ఇట్లు ఇంటర్ కూడా పూర్తి చేయని మీ రామ్ పోతినేని అంటూ ట్వీట్ చేశాడు.