Bank RD: పోస్టాఫీసుల్లోనే కాదు బ్యాంకుల్లోనూ ఆర్‌డీలకు అవకాశం.. అధిక వడ్డీ.. అత్యధిక భద్రత..

దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఆర్‌డీ ఖాతా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. 2024 లెక్కల ప్రకారం వడ్డీ రేటు 2.50 శాతం నుంచి 8.50 మధ్య ఉంటుంది. సీనియర్ సిటిజన్ల ఒక శాతం అదనంగా వడ్డీని అందిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ,హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్ బీ,కెనరా, ఐడీబీఐ, ఎస్ బ్యాంకుల్లో ఈ సౌకర్యం ఉంది.

Bank RD: పోస్టాఫీసుల్లోనే కాదు బ్యాంకుల్లోనూ ఆర్‌డీలకు అవకాశం.. అధిక వడ్డీ.. అత్యధిక భద్రత..
Bank Rd
Follow us

|

Updated on: Apr 01, 2024 | 12:16 PM

డబ్బులు పొదుపు చేయాలంటే మనకు మొదటి గుర్తుకు వచ్చేవి బ్యాంకులు. వాటిలో ఏ పథకాలకు ఎంత వడ్డీరేటు ఉంటుందో తెలుసుకుంటాం. వడ్డీ ఎక్కువగా రావడంతో పాటు నమ్మకమైన బ్యాంకులో డబ్బులను ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తాం. ఇది అందరికీ తెలిసిందే. అయితే బ్యాంకుల్లో కూడా రికరింగ్ డిపాజిట్లు చేసుకునే వీలుంది. వాటిపై కూడా వివిధ రకాల వడ్డీ రేట్లు కూడా ఉంటాయి. సాధారణంగా రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ)లను పోస్టాఫీసు పథకాలుగా భావిస్తాం. అయితే దాదాపు అన్నిప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా తమ సొంత ఆర్ డీలను కలిగి ఉన్నాయి. వీటిపై వడ్డీని 2.50 శాతం నుంచి 8.50 వరకూ అందజేస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు ఆర్‌డీలపై ఒకశాతం అదనపు వడ్డీని కూడా ఇస్తున్నాయి.

కాలపరిమితి వివరాలు..

రికరింగ్ డిపాజిట్ అనేది బ్యాంకుల వద్ద కూడా అందుబాటులో ఉండే ఒక పోస్టాఫీసు పథకం. దీనిని పోస్టాఫీసు ఆర్‌డీ అని కూడా పిలుస్తారు. ఇది త్రైమాసికానికి కలిపి 6.7 శాతం వార్షిక వడ్డీ రేటు రూపంలో హామీ ఇచ్చిన రాబడిని అందిస్తుంది. ఒకరు ఒకటి లేదా ఉమ్మడి ఖాతాను కలిగి ఉండవచ్చు. ఆర్‌డీకి కాలపరిమితి ఐదేళ్లు ఉంటుంది. దాన్ని మరో ఐదు సంవత్సరాలకు పొడిగించవచ్చు. కనీస నెలవారీ డిపాజిట్ రూ. 100 చేయాలి. గరిష్ట పరిమితి లేదు. ముందస్తు చెల్లింపులు కూడా చేయవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి మూడేళ్ల తర్వాాత ముందస్తుగా మూసివేయవచ్చు.

బ్యాంకులలో ఆర్‌డీ సౌకర్యం..

దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఆర్‌డీ ఖాతా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. 2024 లెక్కల ప్రకారం వడ్డీ రేటు 2.50 శాతం నుంచి 8.50 మధ్య ఉంటుంది. సీనియర్ సిటిజన్ల ఒక శాతం అదనంగా వడ్డీని అందిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ,హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్ బీ,కెనరా, ఐడీబీఐ, ఎస్ బ్యాంకుల్లో ఈ సౌకర్యం ఉంది.

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐలో వడ్డీరేట్లు..

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీఐ లో నెలకు కనీసం రూ. 100 డిపాజిట్‌తో ఆర్ డీ సౌకర్యం ఉంది. డిపాజిట్ కనిష్ట వ్యవధి 12 నెలలు. గరిష్ట వ్యవధి పదేళ్ల వరకూ ఉంటుంది. సాధారణ పౌరులకు రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై 6.50 శాతం నుంచి 7 శాతం వార్షిక వడ్డీ రేడ్డీని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు అదనంగా 0.50 శాతం నుంచి 0.80 శాతం వడ్డీ ని పొందవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్‌..

ఈ బ్యాంకులో స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాలిక ఆర్ డీలపై వేర్వేరు వడ్డీ రేట్లు అమలవుతున్నాయి. ఒక ఏడాది కాలపరిమితి ఉన్న ఆర్ డీలను స్వల్పకాలిక డిపాజిట్లుగా గుర్తించింది. వీటి కింద 4.75 శాతం నుంచి 6.70 శాతం వరకు వడ్డీ ఇస్తుంది. ఒకటి నుంచి మూడేళ్ల లోపు మధ్యస్థ ఆర్ డీలకు 6.70 శాతం నుంచి 7.20 శాతం మధ్య, మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు దీర్ఘకాలిక ఆర్ డీలకు ఏడాదికి 7 శాతం, ఐదేళ్లకు పైబడి, పదేళ్ల వరకూ ఉన్న ఆర్ డీలపై 6.90 శాతం వడ్డీని అందజేస్తుంది. సీనియర్ సిటిజన్లకు 5.25 నుంచి 7.75 శాతం మధ్య వడ్డీ లభిస్తుంది.

హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు..

ఈ బ్యాంకు ఆర్ డీలపై అందించే వడ్డీరేట్లు డిపాజిట్ సొమ్ముపై ఆధారపడి ఉంటుంది. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై 3 నుంచి 7.75 శాతం మధ్యలో ఉంటాయి. రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల లోపు 4.75 నుంచి 7.90 శాతం వరకూ, రూ. 5 కోట్ల కంటే ఎక్కువ, సమానమైన డిపాజిట్లపై 4.75 శాతం నుంచి 7.40 శాతం మధ్య ఉంటాయి.

వివిధ బ్యాంకుల్లో వడ్డీరేట్లు ఇలా..

ఎస్‌బీఐ సాధారణ ఖాతాదారులకు 6.50 నుంచి 6.80 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7 నుంచి 7.50 శాతం వడ్డీ అందజేస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు 4.75 నుంచి 6.90 (సాధారణ), 5.25 నుంచి 7.50 (సీనియర్‌ సిటిజన్ల), హెచ్‌డీఎఫ్‌సీ 4.50 నుంచి 7 (సాధారణ), 5 నుంచి 7.75 (సీనియర్‌ సిటిజన్లు), కోటక్‌ మహీంద్రా బ్యాంకు 4.30 నుంచి 5.20 (సాధారణ), 4.80 నుంచి 5.70 (సీనియర్ సిటిజన్లు), యాక్సిస్‌ బ్యాంకు 3 నుంచి 7 (సాధారణ), 3.50 నుంచి 7.75 (సీనియర్ సిటిజన్లు), బ్యాంకు ఆఫ్‌ బరోడా 5.25 నుంచి 6.75 (సాధారణ), 5.75 నుంచి 7.25 (సీనియర్ సిటిజన్లు), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు 4.40 నుంచి 5.30 (సాధారణ), 4.90 నుంచి 6.05 (సీనియర్ సిటిజన్లు), ఐడీబీఐ బ్యాంకు 5.05 నుంచి 5.25 (సాధారణ), 5.55 నుంచి 5.75 సీనియర్ (సిటిజన్లు), సిటీ బ్యాంకు 2.75 నుంచి 3 వరకూ (సాధారణ), 3.25 నుంచి 4 వరకూ (సీనియర్ సిటిజన్లు), కెనరా బ్యాంకు 6.50 నుంచి 6.80 వరకూ (సాధారణ), 7 నుంచి 7.25 వరకూ (సీనియర్ సిటిజన్లు) వడ్డీని అందజేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!