మళ్లీ తెరపైకి హీరాగోల్డ్ వ్యవహారం.. చిక్కుల్లో సెలబ్రెటీలు..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరా గోల్డ్ కేసు వ్యవహారాన్ని పోలీసులు ముమ్మరం చేశారు. మదుపరుల నుంచి సేకరించిన 5 వేల కోట్ల పెట్టుబడులు ఆ సంస్థ ఖాతాలోకి కాకుండా ఎక్కడికి మళ్లించారనే విషయం పై దర్యాప్తు చేస్తున్నారు. హీరాగోల్డ్‌కు ప్రచారం చేసిన సెలబ్రెటీలపై దృష్టి సారించారు. శాఖల విస్తరణలో భాగంగా ఐదేళ్ల క్రితం ముంబయి, దిల్లీ, దుబాయి, అబుదాబీలో నౌహీరా షేక్ ఆ సంస్థకు సంబంధించిన కార్యాలయాలు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇద్దరు బాలీవుడు హీరోయిన్లు, […]

మళ్లీ తెరపైకి హీరాగోల్డ్ వ్యవహారం.. చిక్కుల్లో సెలబ్రెటీలు..
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2019 | 7:48 AM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరా గోల్డ్ కేసు వ్యవహారాన్ని పోలీసులు ముమ్మరం చేశారు. మదుపరుల నుంచి సేకరించిన 5 వేల కోట్ల పెట్టుబడులు ఆ సంస్థ ఖాతాలోకి కాకుండా ఎక్కడికి మళ్లించారనే విషయం పై దర్యాప్తు చేస్తున్నారు. హీరాగోల్డ్‌కు ప్రచారం చేసిన సెలబ్రెటీలపై దృష్టి సారించారు.

శాఖల విస్తరణలో భాగంగా ఐదేళ్ల క్రితం ముంబయి, దిల్లీ, దుబాయి, అబుదాబీలో నౌహీరా షేక్ ఆ సంస్థకు సంబంధించిన కార్యాలయాలు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇద్దరు బాలీవుడు హీరోయిన్లు, మాజీ క్రికెటర్, మరో క్రీడాకారిణి పాల్గొనినట్లు గుర్తించారు. ప్రచారం చేసినందుకు డబ్బు తీసుకున్నారా..? లేక స్నేహపూర్వకంగా హాజరయ్యారా..? అనే అంశాల పై పోలీసులు కూపీ లాగుతున్నారు. కాగా ఈ ఐదుగురిలో ఇద్దరికి హారాగోల్డ్ కంపెనీల్లో వాటాలు ఉన్నాయనే ప్రచారం పై విచారణ జరుపుతున్నారు. దీనిపై ముంబయి పోలీసులను సంప్రదించి సెలబ్రిటీలు ప్రచారం చేసినట్టు ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతున్నారు.

ఇప్పటికే హీరా గోల్డ్ సంస్థలకు చెందిన మేనేజెర్లకు సీసీఎస్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. వీరు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు విమానాశ్రయాలకు ముందే సమాచారం అందించారు. నౌహీరా షేక్ అరెస్టైన తర్వాత ఐదుగురు మేనెజర్లు, ఇద్దరు నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే