ఏపీలో హమాలీల చార్జీలు పెంపు

హమాలీలకు చెల్లించే చార్జీలను పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రేషన్ పంపిణీ వ్యవస్థలో భాగంగా మండల స్థాయి స్టాకు (ఎంఎల్‌ఎస్‌) పాయింట్ల నుంచి

ఏపీలో హమాలీల చార్జీలు పెంపు
Follow us

|

Updated on: Oct 07, 2020 | 10:09 AM

హమాలీలకు చెల్లించే చార్జీలను పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రేషన్ పంపిణీ వ్యవస్థలో భాగంగా మండల స్థాయి స్టాకు (ఎంఎల్‌ఎస్‌) పాయింట్ల నుంచి రేషన్‌ దుకాణాలకు సరుకులను తరలించేందుకు (లోడింగ్, అన్‌లోడింగ్‌ కింద) హమాలీలకు చెల్లించే చార్జీలను క్వింటాల్‌కు రూ.19 నుండి 22లకు పెంచుతూ పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన చార్జీలు ఈ ఏడాది జనవరి నుండి అమల్లోకి వస్తాయని తెలిపారు. దీని వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.9.09 కోట్ల అదనపు భారం పడుతుందని వెల్లడించారు.

Also Read : రేపే ‘జగనన్న విద్యా కానుక’, 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి