విడాకుల భరణం చెల్లింపుల్లో సుప్రీంకోర్టు కొత్త మార్గదర్శకాలు..

మనిషి జీవితంలో దాంపత్యం అనేది చాలా సున్నితమైన రిలేషన్. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండేందుకు ఎంతో అవగాహన అవసరం.

విడాకుల భరణం చెల్లింపుల్లో సుప్రీంకోర్టు కొత్త మార్గదర్శకాలు..
Follow us

|

Updated on: Nov 05, 2020 | 5:24 PM

మనిషి జీవితంలో దాంపత్యం అనేది చాలా సున్నితమైన రిలేషన్. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండేందుకు ఎంతో అవగాహన అవసరం. అయితే వారు తమ జీవితం నచ్చనప్పుడు విడిపోవడానికి కూడా అంతే వెసులుబాటు కల్పించేలా చట్టాలు, భారత రాజ్యాంగంలో రూపొందించారు. తాజాగా వివాహ విషయాల్లో పోషణ ఖర్చుల చెల్లింపునకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం విస్తృత మార్గదర్శకాలు జారీ చేసింది.

దాంపత్య జీవితం నుంచి విడిపోయినవారు మెయింటెనెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్ననాటి నుంచే న్యాయస్థానాలు వారికి జీవనభృతి మంజూరు చేయాలని జస్టిస్‌ ఇందు మల్హోత్రా, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. హిందూ వివాహచట్టం, గృహహింస నిరోధక చట్టంలో దేనికింద పోషణ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అదేరోజు నుంచి వర్తింపజేయాలని ‘రజ్‌నీష్‌ వర్సెస్‌ నేహ (ఎస్‌ఎల్‌పీ క్రిమినల్‌ నం.9503/2018) కేసు’లో ధర్మాసనం స్పష్టంచేసింది. న్యాయప్రక్రియలో జాప్యం అన్నది దరఖాస్తుదారు చేతుల్లో ఉండదు కాబట్టి వారికి దరఖాస్తు చేసుకున్న నాటినుంచే దాన్ని పొందే హక్కు కల్పించాలని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఇందుకు సంబంధించి కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది ధర్మాసనం.