కేంద్రం జీఎస్టీ ఎగవేతదారులపై కొరఢా ఝళిపిస్తోంది. దేశ వ్యాప్తంగా మూడు వారాల పాటు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా 1161 కేసులను ది డైరెక్టరేట్ జనర్నల్ ఆఫ్ జీఎస్టీ ఇంటలిజెన్స్, సీజీఎస్టీ కమిషనరేట్ నమోదు చేసింది. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగువేసేందుకు ప్రయత్నించిన వారిపై కేసులు నమోదు చేశాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న 38 నగరాల్లో జీఎస్టీ బృందాలు తనిఖీలను నిర్వహించాయి. వాటిలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, భువనేశ్వర్, భోపాల్, కల్‌కత్తా, విశాఖపట్నం, సూరత్, వడోదరా, రాజ్ కోట్, ఇండోర్, రాయ్‌పూర్, జమ్మూ వంటి నగరాల్లో జీఎస్టీ బృందాలు పర్యటించాయి. వ్యాపారస్తుల బిల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పలువురు వ్యాపారులు దొంగ జీఎస్టీ నంబర్లతో కొనుగోలు, అమ్మకాలు జరుపుతుండడం, బిల్లు బుక్కుల్లో మోసాలుండడంతో జీఎస్టీ అధికారులు కేసులు నమోదు చేశారు.
ముంబైకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కుమారుడు సునిల్ రత్నాకర్ గుట్టె ఫేక్ ఇన్వాయిస్ లతో వ్యాపార కార్యాకలాపాలను నిర్వహించినట్లు జీఎస్టీ బృందాలు గుర్తించాయి. అతడిపై కేసు కూడా నమోదు చేశాయి. అయితే, ఎమ్మెల్యే కొడుకు సునిల్ దాదాపు 520 కోట్ల విలువైన వ్యాపార కార్యకలాపాలను తప్పడు పత్రాల ద్వారా నిర్వహించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, నిందితుడు బెయిల్ కోసం అప్లై చేయగా… ముంబై సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. దొంగ ఇన్వాయిస్లు, దొంగ బిల్ పుస్తకాల సాయంతో కోట్ల అవినీతి చేసేందుకు అతడు ప్రయత్నించినట్లు బలమైన ఆధారాలతో జీఎస్టీ సంస్థ కేసును నమోదు చేసింది. కాగా, పన్ను ఎగవేతదారులపై దాడులు కొనసాగుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.