Green India Challenge: నేను సైతం అన్న సునీల్

|

Nov 09, 2020 | 7:38 PM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు విలక్షణ నటుడు హీరో సునీల్. నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన హీరో సునీల్... జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు.

Green India Challenge: నేను సైతం అన్న సునీల్
Follow us on

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు విలక్షణ నటుడు హీరో సునీల్. నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన హీరో సునీల్… జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన వంతుగా మొక్కలు నాటడం సంతోషాన్నిఇచ్చిందన్నారు సునీల్. మన జీవితానికి కావాల్సిన ఆక్సిజన్ తీసుకోవడం కోసం మనం మొక్కలు నాటాలని చెప్పారు . పెద్దలు చెప్పిన వృక్షో రక్షతి, రక్షిత: అన్న మాటలను దృష్టిలో పెట్టుకుని అందరూ బాధ్యతగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని సునీల్ కోరారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వనంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్‌కు సునీల్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టిస్ట్ సురేఖ వాణి, కలర్ ఫోటో సినిమా చిత్ర బృందం… డైరెక్టర్ సందీప్ రాజ్ , హీరో సుహాస్ , హీరోయిన్ చాందిని చౌదరి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు కాల భైరవ, కమెడియన్ వైవా హర్ష లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని సునీల్ పిలుపునిచ్చారు.

Also Read :

వయోవృద్ధులు, చిన్నారులకు అప్పుడే శ్రీవారి దర్శనం

సామాన్యులకు చిక్కనంటోన్న ఉల్లి

పేపర్‌ కప్పులో టీ, కాఫీ తాగడం కూడా ప్రమాదకరమే !