Gold Mine : యూపీలో ఆ గుట్ట నిండా బంగారమే..విలువ ఎంతంటే..?

Gold Mine :  ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో దొరికిన టన్నుల బంగారు నిల్వలను వేలం వేయడానికి అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఉత్తర ప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ నివేదికల ప్రకారం.. సోన్ పహాది, హార్ది గ్రామ ప్రాంతంలో  3,500 టన్నుల బంగారం నిక్షేపాలున్నాయని అంచనా. బంగారం గుర్తించిన చోట బ్లాకుల కేటాయింపు ప్రక్రియను యూపీ ప్రభుత్వం ప్రారంభించింది. కోన్ ప్రాంతంలోని హార్ది గ్రామంలో, మహులి ప్రాంతంలోని సోన్ పహాదీలో […]

Gold Mine : యూపీలో ఆ గుట్ట నిండా బంగారమే..విలువ ఎంతంటే..?
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 25, 2020 | 7:03 PM

Gold Mine :  ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో దొరికిన టన్నుల బంగారు నిల్వలను వేలం వేయడానికి అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఉత్తర ప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ నివేదికల ప్రకారం.. సోన్ పహాది, హార్ది గ్రామ ప్రాంతంలో  3,500 టన్నుల బంగారం నిక్షేపాలున్నాయని అంచనా. బంగారం గుర్తించిన చోట బ్లాకుల కేటాయింపు ప్రక్రియను యూపీ ప్రభుత్వం ప్రారంభించింది. కోన్ ప్రాంతంలోని హార్ది గ్రామంలో, మహులి ప్రాంతంలోని సోన్ పహాదీలో పెద్ద మొత్తంలో బంగారం నిల్వ ఉన్నట్లు నిర్ధారించబడింది. ఇ-టెండరింగ్ ప్రక్రియ ద్వారా ఈ బ్లాకులను వేలం వేయడానికి ప్రభుత్వం ఏడుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం మొత్తం ప్రాంతాన్ని జియో-ట్యాగింగ్ చేసి.. ఫిబ్రవరి 22 లోగా లక్నోలోని జియాలజీ అండ్ మైనింగ్ డైరెక్టరేట్‌కు నివేదికను సమర్పించనుంది.

ఉత్తర ప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ అధికారిక లెక్కల ప్రకారం… 2,943.26 టన్నుల బంగారు నిల్వ సోన్ పహాది వద్ద ఉండగా, 646.15 కిలోల బంగారం హార్ది బ్లాక్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం, భారతదేశంలో ప్రస్తుతం 626 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. తాజాగా గుర్తించిన కొత్త నిల్వలు వాటికి దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. వాటి విలువ రూ. 12 లక్షల కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా.  సెంట్రల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బాధ్యతలు స్వీకరించిన తరువాత 1992-93 సంవత్సరంలో సోన్‌భద్రలో బంగారు నిల్వలను కనుగొనే పని ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో బంగారు నిల్వను కనుగొనే ప్రక్రియను బ్రిటిష్ వారు మొదట ప్రారంభించినట్లు సమాచారం. భారీగా బంగారు నిక్షేపాలు బయటపడటంతో యూపీకి ఆదాయం మరింత పెరుగనుండటంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. 

ఇది కూడా చదవండి : వరుసగా 6 రోజులు బ్యాంకు సేవలు బంద్..చూస్కోండి..!

Latest Articles
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
కన్నప్ప కోసం అక్షయ్‌ అన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
కన్నప్ప కోసం అక్షయ్‌ అన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా