భూమికి అతి సమీపంగా దూసుకొస్తున్న భారీ గ్రహశకలం

భూమికి అతి సమీపంగా దూసుకొస్తున్న భారీ గ్రహశకలం

  అంతరిక్షానికి సంబంధించిన పలు విషయాలు భూమి మీద ఉన్న మనకు చాలా భయోత్పాతాన్ని కలిగిస్తాయి. ఈ విశ్వాంతరాళంలో ఉన్న ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు, గ్రహ శకలాలు మనకు అంతుచిక్కని ఆలోచనలనే మిగులుస్తాయి. సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమి, ఆ భూమపై మనం. భూమికి దగ్గరగా గ్రహశకలాలు వస్తున్నాయని పలుమార్లు వింటుంటాం. ఏదైనా భారీ గ్రహశకలం భూమికి దగ్గరగా వస్తుందంటే అది భయాన్ని కలిగిస్తుంది. అయితే తాజాగా ఇప్పుడు భారీ గ్రహ శకలం ఒకటి భూమికి అతి […]

Ram Naramaneni

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:36 PM

అంతరిక్షానికి సంబంధించిన పలు విషయాలు భూమి మీద ఉన్న మనకు చాలా భయోత్పాతాన్ని కలిగిస్తాయి. ఈ విశ్వాంతరాళంలో ఉన్న ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు, గ్రహ శకలాలు మనకు అంతుచిక్కని ఆలోచనలనే మిగులుస్తాయి. సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమి, ఆ భూమపై మనం. భూమికి దగ్గరగా గ్రహశకలాలు వస్తున్నాయని పలుమార్లు వింటుంటాం. ఏదైనా భారీ గ్రహశకలం భూమికి దగ్గరగా వస్తుందంటే అది భయాన్ని కలిగిస్తుంది.

అయితే తాజాగా ఇప్పుడు భారీ గ్రహ శకలం ఒకటి భూమికి అతి చేరువుగా రాబోతోంది. ఇప్పుడు దీని గురించే అంతా చర్చ నడుస్తోంది. నాసా శాస్త్రవేత్తలు దీన్ని శ్రద్ధగా గమనిస్తున్నారు. నాసా దానికి MD8 అని పేరు పెట్టింది. 280 అడుగుల చుట్టుకొలతతో ఉన్న అది గంటకు 30422 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందట. అయితే ఆ స్పీడ్‌లో ఉన్న గ్రహ శకలం భూమికి అత్యంత సమీపంగా 3 మిలియన్ మైళ్ల దూరం తేడాతో మాత్రమే దూసుకెళ్లబోతోంది. కాబట్టి మన ఊపిరి పీల్చుకోవచ్చు. అదే 46 లక్షల మైళ్ల దూరంలోపు ఏదైనా గ్రహ శకలం దూసుకెళితే దాని ప్రభావం మన భూమి మీద ఖచ్చితంగా ఉంటుంది.

పెను నష్టం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు దాన్ని దారి మళ్లించేందుకు కష్టపడాల్సి ఉటుంది. 30 మిలియన్ మైళ్ల దూరంలో ఉండే ప్రతిదాన్ని భూమికి దగ్గరగా ఉన్న వాటిగానే ప్రస్తుతం మనం గుర్తిస్తున్నాం. ఎందుకంటే ఆ మాత్రం రేంజ్‌లో ఉన్నప్పుడు వాటి ప్రభావం మనకు తెలుస్తుంది. ఈ 30 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న వాటన్నింటిపైన నాసా ఇప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో వాటితో ఏదైనా ప్రమాదం వచ్చే అవకాశాలు ఉంటే వెంటనే చర్యలు తీసుకునేందుకు.

అయితే ప్రస్తుతం మన భూమికి దగ్గరగా దూసుకెళ్లబోతున్న MD8 అనే గ్రహశకలంతో భయపడాల్సిన అవసరం లేదు. దాని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, కంగారు పడాల్సిన అవసరం లేదని నాసా వెల్లడించింది. నాసా లెక్కల ప్రకారం భూమిని ఢీకొట్టే గ్రహశకలాలు దరిదాపుల్లో కూడా లేవు. రాబోయే కొన్ని వందల ఏళ్ల వరకూ కూడా అలాంటి అవకాశం లేదని కూడా నాసా స్పష్టం చేసింది. ప్రస్తుతం మన సూర్య వ్యవస్థలో సుమారుగా 6 లక్షల వరకు గ్రహ శకలాలు తిరుగుతున్నాయి. అయితే వాటిలో 16 వేలు మాత్రమే మన భూమికి సమీపంలో ఉన్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu