ఢిల్లీ శాస్త్రి భవన్‌‌కు శాపమా..!

దేశ రాజధాని ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ భవనంలోని ఏడో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. అక్కడ ఏడు ఫైరింజన్లు మంటలు అదుపుచేసేందుకు శ్రమించాయి. కొంతసేపటికి మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శాస్త్రిభవన్‌లో న్యాయ, సమాచార, మానవ వనరుల అభివృద్ధి శాఖ, కార్పోరేట్ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. కాగా 2014లోనూ శాస్త్రి భవన్‌లోని ఏడో అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. […]

ఢిల్లీ శాస్త్రి భవన్‌‌కు శాపమా..!

Updated on: Apr 30, 2019 | 4:46 PM

దేశ రాజధాని ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ భవనంలోని ఏడో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. అక్కడ ఏడు ఫైరింజన్లు మంటలు అదుపుచేసేందుకు శ్రమించాయి. కొంతసేపటికి మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

శాస్త్రిభవన్‌లో న్యాయ, సమాచార, మానవ వనరుల అభివృద్ధి శాఖ, కార్పోరేట్ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. కాగా 2014లోనూ శాస్త్రి భవన్‌లోని ఏడో అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. ఏసీలో షార్ట్‌ సర్కూట్ వలన అప్పుడు ప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us