సుశాంత్ డైరీలో ఇలా రాసుకున్నాడు..

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయి మూడు నెలలు దాటిపోయింది. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య విషయంలో రకరకాల కోణాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా సుశాంత్ ఫ్యూచర్ ప్లాన్స్‌కు సంబంధించి కొన్ని విషయాలు టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది. సుశాంత్ డైరీకి సంబంధించి...

  • Sanjay Kasula
  • Publish Date - 6:31 pm, Thu, 17 September 20
సుశాంత్ డైరీలో ఇలా రాసుకున్నాడు..

Sushant diary : బాలీవుడ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయి మూడు నెలలు దాటిపోయింది. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య విషయంలో రకరకాల కోణాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా సుశాంత్ ఫ్యూచర్ ప్లాన్స్‌కు సంబంధించి కొన్ని విషయాలు టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది. సుశాంత్ డైరీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు లీక్‌ అయ్యాయి. ముఖ్యంగా 2020లో ఎన్నో కార్యక్రమాలు చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. డైరీ మొదటి పేజీలో అనుభవం, విశ్లేషణపై పలు విషయాలు రాసుకున్నారు.

ఏప్రిల్ 27, 2018 నాటి నోట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన దినచర్యను రాశారు. ఆరోజు తెల్లవారుజామున 2:30 గంటలకు మేల్కొన్నారు. అతను కొన్ని వేద శ్లోకాలను పఠించాడని కూడా డైరీలో రాసుకున్నారు. మర్నాడు కేదార్‌నాథ్‌ గురించి చదవాలని ప్లాన్‌ చేసుకున్నారు. స్మోకింగ్‌ మానేయాలనే ప్రయత్నాన్ని కూడా ఆ రోజు తన డైరీ రాసుకున్నారు.

ఇక రెండో పేజీలో గజిబిజిగా చాలా విషయాలు రాసుకున్నారు బాలీవుడ్ యువ హీరో సుశాంత్‌. సమస్యలను ఎలా పరిష్కరించాలి… ఎందుకు ఆనందం… సరైన సమాధానం లేదు, మంచి ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి అని రాశారు. అలాగే – అనుభవం, విశ్లేషణ, ఆనందం, ధైర్యం, బ్రిలియెన్స్ మరియు డివైన్ అని కూడా రాసుకున్నారు.

ఇంకో పేజీలో ప్రముఖ కవి కబీర్‌ రాసిన కవితలు ఉన్నాయి. తెలుగులో వాటి సారాంశాన్ని చూస్తే… “నేను అక్కడ ఉన్నప్పుడు.. దేవుడు లేడు, ఇప్పుడు దేవుడు ఉన్నాడు కాని నేను కాదు… అలాగే… మీరు కోరుకునేది మిమ్మల్ని వెతుకుతోంది” అని సుశాంత్ డైరీలో రాసి ఉంది.

మరో పేజీలో నీతి ఆయోగ్ విధానాలు, నాసా, విద్యావిధానం, మేధావులు, అక్షరాస్యులు, రూపకాలు, వివిధ రకాల సాహిత్యాలు మొదలైన అంశాలున్నాయి. మరోవైపు – సుశాంత్‌ మెయిన్‌టెయిన్‌ చేసిన వివిధ బ్యాంక్‌ ఖాతాల వివరాలు కూడా టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది. ఎప్పుడెప్పుడు… ఎంత ఖర్చు చేశాడు.. ఎవరెవరికి డబ్బులు ఇచ్చాడు తదితర విషయాలు ఆ స్టేట్‌మెంట్స్‌ ద్వారా తెలుస్తోంది. సీబీఐ విచారణలో ఈ డైరీ, బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌ కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే ఇంత అద్భుతమనై చేతి రాతతో చాలా పాజిటివ్ ధోరణిలో రాసుకున్న వ్యక్తి ఎందుకు సూసైడ్ నోటు రాయలేదు.. అన్నదే ఇప్పుడు సీబీఐ అధికారులకు కలుగుతున్న ప్రశ్న…