ఇప్పుడు మేము చెప్పబోయే న్యూస్ కాస్త వినడానికి ఇబ్బంది పడేదిగానే ఉంటుంది. కానీ ఇంటిని, ఒంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో కళ్లకు కట్టే సంఘటన కాబట్టి చెప్పక తప్పదు. చెవి విపరీతంగా నొప్పి రావడంతో ఓ వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్లాడు. ఇన్పెక్షన్ అయి ఉంటుంది..రెండు యాంటీ బయోటిక్ టాబ్లెట్స్..చుక్కల మందు ఇచ్చి పంపిస్తారని అనుకున్నాడు. కట్ చేస్తే.. అతని చెవిలో బొద్దింకలు తిరుగుతున్నాయని చెప్పడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని గువాంగ్‌డాంగ్ ప్రావిన్స్ హుయాంగ్ జిల్లాలో నివాసం ఉండే ఎల్‌వీ (24) అనే ఓవ్యక్తికి నిద్రలో ఉండగా సడెన్‌గా చెవుల్లో తీవ్రమైన నొప్పి మొదలైంది. అది బాగా ఎక్కువవడంతో అతను తనకు దగ్గర్లో ఉన్న సన్హె అనే హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ ఈఎన్‌టీ స్పెషలిస్టులు ఎల్‌వీకి టెస్టులు చేసి షాక్ తిన్నారు. ఎందుకంటే.. ఎల్‌వీ కుడి చెవిలో ఏకంగా కొన్ని బొద్దింకలు మకాం ఏర్పాటు చేసుకున్నాయి. అలర్ట్ అయిన డాక్టర్లు వాటిని ట్వీజర్ సాయంతో వైద్యులు తొలగించారు. ఒక పెద్ద బొద్దింక సహా, పది చిన్న బొద్దింకలను ఎల్‌వీ చెవి నుంచి తొలగించినట్లు అతనికి చికిత్స అందించిన డాక్టర్ జోవాంగ్ యిజీన్ తెలిపారు.
తినడానికి తెచ్చుకునే ఆహారం ప్యాకెట్లను సగం తిన్న తర్వాత..మిగిలినవి తన మంచంపైనే పెట్టుకుని నిద్రపోవడం అలవాటట ఎల్‌వీకి. దీంతో వాటిని తినేందుకు వచ్చిన బొద్దింకలు అతని చెవిలో దూరాయి. చూశారా..మనం బద్దంకంగా భావించే కొన్ని పనులు ప్రాణాలకే ముప్పు తెస్తాయి. సో బీ కేర్‌ఫుల్ గయ్స్.