Hyderabad: పాత ఆటోలను కొత్త వాటిగా మారుస్తున్న కంపెనీ.. డీజిల్, గ్యాస్ ఇంజన్‌ల బదులు బ్యాటరీ రీప్లేస్

హైదరాబాద్ లోని 'enviro smart' అనే ఒక కంపెనీ వాళ్ళు పాతబడిన ఆటోలను కొత్త ఆటోలుగా మారుస్తున్నారు. అంతేకాదు వాటి నుంచి డీజిల్, గ్యాస్ ఇంజన్ లను తీసేసి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బ్యాటరీ ఆటోలుగా మారుస్తున్నారు.

Hyderabad: పాత ఆటోలను కొత్త వాటిగా మారుస్తున్న కంపెనీ..  డీజిల్, గ్యాస్ ఇంజన్‌ల బదులు బ్యాటరీ రీప్లేస్
Enviro Smart Startup
Follow us

|

Updated on: Jun 30, 2022 | 6:34 AM

Hyderabad: హైదరాబాద్ లో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతుంది. వ్యక్తిగత వాహనాల తో పాటు ప్రజా రవాణా వాహనాలు కూడా చాలా ఎక్కువగా రోడ్లమీద తిరుగుతున్నాయి. ఇలానే కొనసాగుతే మనం భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. ముందు తరానికి వాయు కాలుష్యం లేని గాలిని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో EV వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ లోని ‘enviro smart’ అనే ఒక కంపెనీ వాళ్ళు పాతబడిన ఆటోలను కొత్త ఆటోలుగా మారుస్తున్నారు. అంతేకాదు వాటి నుంచి డీజిల్, గ్యాస్ ఇంజన్ లను తీసేసి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బ్యాటరీ ఆటో లుగా మారుస్తున్నారు.

హైదరాబాదులో ప్రజలు ఎక్కడ చూసినా ఆటోల్లోనే ఎక్కువగా తిరుగుతుంటారు. ఏ మూల చూసినా ఆటోలే దర్శనమిస్తాయి. అలాంటి ఈ ఆటోలు నుంచి పొల్యూషన్ ని తగ్గించడానికి ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఆటో డ్రైవర్లకు ఎలక్ట్రికల్ ఆటోలను అందించి ప్రభుత్వం ప్రోత్సహిస్తూనే ఉన్నది. ఆటోలే కాకుండా ప్రస్తుత కాలంలో అన్ని వాహనాలు ఎలక్ట్రికల్ గా మారుతున్నాయి..

కొత్త ఆటోలు కాకుండా పాతబడిన ఆటోలు కూడా బ్యాటరీ గా మారితే చాలా పొల్యూషన్ తగ్గే అవకాశం ఉంటుందని ఆలోచించారు హైదరాబాద్ లో enviro smart కంపెనీ. రోజు రోజుకీ పెరుగుతున్న ఇంధన ధరల వలన ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు ఈ ఆటోల వలన ఏంతో లాభం కలుగుతుంది. పాత ఆటోల నుంచి డీజిల్, గ్యాస్ ఇంజన్లను తీసేసి ఎలక్ట్రిక్ బండ్లుగా మారుస్తున్నారు కంపెనీ యాజమాన్యం

ఇవి కూడా చదవండి

సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం వెహికల్స్ కి రీ మోడిఫికేషన్ చేసి వాటికి కావలసిన అప్రూవల్ తెచ్చుకొని కస్టమర్ల పాత ఆటోలను తీసుకొని ఎలక్ట్రికల్ ఆటోలుగా మారుస్తున్నారు. ఇలా చేయడం వలన ఇంధన ధరలతోనే కాకుండా, వాతావరణ పొల్యూషన్ ని కూడా తగ్గిస్తున్నారు. ఎలక్ట్రిక్ రెట్రో ఫిట్మెంట్ ఇంజన్ కి తక్కువ ఖర్చు అవుతుంది. కొత్త ఆటో ఖర్చుతో పోలిస్తే 60% లోనే పాత ఆటోను కొత్త దానిలా ఎలక్ట్రికల్ ఆటోగా మార్చవచ్చు. ఇలా ఇంజన్ మార్చే ప్రాసెస్ లో ఆటోమొబైల్స్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ తెచ్చుకొని 20 రకాల టెస్టులు అధిగమించి ARAI సర్టిఫికేషన్ ని పొందారు. ప్యాసింజర్ ఆటోలతో పాటు కారు, ఆటోలను కూడా ఎలక్ట్రికల్ గా మారుతున్నారు.

Reporter: vidhay, TV9 Telugu

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..