వామ్మో ! మనిషి ఎక్కినట్టే గోడను ఎక్కి …

| Edited By: Anil kumar poka

Jan 11, 2020 | 5:17 PM

జాంబియాలోని నేషనల్ పార్కులో ఓ ఏనుగుకు ఉన్నట్టుండి మామిడి పండ్లు గుర్తుకొచ్చినట్టుంది. ఈ పార్కులోని ఓ మామిడి చెట్టుకు, ఈ గజరాజం తిరుగాడే స్థలానికి మధ్య 5 అడుగుల ఎత్తయిన గోడ ఉంది. ఆ చెట్టుకు మామిడి కాయలో, పండ్లో లేకున్నా.. చెట్టును చూడగానే మాత్రం దీనికి ‘ నోరూరింది ‘. అంతే ! మెల్లగా కదిలి.. తన భారీ శరీరంతో ఆ గోడను మనిషి ఎక్కినట్టే.. ఎక్కి అవతలికి చేరుకుంది. అయితే పాపం ! ఇది […]

వామ్మో ! మనిషి ఎక్కినట్టే గోడను ఎక్కి ...
Follow us on

జాంబియాలోని నేషనల్ పార్కులో ఓ ఏనుగుకు ఉన్నట్టుండి మామిడి పండ్లు గుర్తుకొచ్చినట్టుంది. ఈ పార్కులోని ఓ మామిడి చెట్టుకు, ఈ గజరాజం తిరుగాడే స్థలానికి మధ్య 5 అడుగుల ఎత్తయిన గోడ ఉంది. ఆ చెట్టుకు మామిడి కాయలో, పండ్లో లేకున్నా.. చెట్టును చూడగానే మాత్రం దీనికి ‘ నోరూరింది ‘. అంతే ! మెల్లగా కదిలి.. తన భారీ శరీరంతో ఆ గోడను మనిషి ఎక్కినట్టే.. ఎక్కి అవతలికి చేరుకుంది. అయితే పాపం ! ఇది మామిడి పండ్లు లేదా కాయల సీజన్ కాకపోవడంతో.. వట్టి చెట్టును చూసి బేర్ మంది. అది గోడను ఎక్కుతున్న సీన్ చూస్తూ పడీపడీ నవ్వుకున్న ఆ పార్కు నిర్వాహకుడు ఆండీ హాగ్..  ఫోటోలు, వీడియో తీసి అందరితో షేర్ చేసుకున్నాడు. మనం కూడా తప్పనిసరిగా నవ్వుకోవలసిందే !