మోదీపై ’ఈసీ‘ నజర్

ప్రధాని నరేంద్రమోదీపై కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోనుందా..? తన ఎన్నికల ప్రచార సభల్లో వైమానిక దాడుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను ఈసీ పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందా..? అన్న విషయాన్ని పరిశీలిస్తోంది. ఈ విషయమై ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు ముగిసేలోగానే ఏదో ఒక చర్య తీసుకోవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 9న ప్రధాని తన ప్రసంగంలో పుల్వామా ఘటన గురించి ప్రస్తావిస్తూ.. సైనికుల సాహసాలను […]

మోదీపై ’ఈసీ‘ నజర్

Updated on: Apr 24, 2019 | 5:00 PM

ప్రధాని నరేంద్రమోదీపై కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోనుందా..? తన ఎన్నికల ప్రచార సభల్లో వైమానిక దాడుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను ఈసీ పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందా..? అన్న విషయాన్ని పరిశీలిస్తోంది. ఈ విషయమై ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు ముగిసేలోగానే ఏదో ఒక చర్య తీసుకోవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ నెల 9న ప్రధాని తన ప్రసంగంలో పుల్వామా ఘటన గురించి ప్రస్తావిస్తూ.. సైనికుల సాహసాలను గుర్తు చేశారు. బాలాకోట్‌లో వైమానిక దాడులు జరిపిన సైనికులకు, పుల్వామా దాడిలో మరణించిన అమరవీరులకు మీ మొట్టమొదటి ఓటును వేస్తారా..? అని స్థానికులను ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ దృష్టి సారించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us