ఐపీఎల్ క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు

| Edited By:

Sep 15, 2020 | 4:16 PM

ఐపీఎల్‌లో డోపింగ్‌ పరీక్షల కోసం క్రికెటర్ల శాంపిళ్లను సేకరించేందుకు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ సిద్ధమవుతోంది. యూఏఈకి చెందిన జాతీయ డోపింగ్‌ నిరోధక కమిటీతో ఓ అవగాహన కుదుర్చుకుంది.

ఐపీఎల్ క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు
Follow us on

ఐపీఎల్‌లో డోపింగ్‌ పరీక్షల కోసం క్రికెటర్ల శాంపిళ్లను సేకరించేందుకు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ సిద్ధమవుతోంది. యూఏఈకి చెందిన జాతీయ డోపింగ్‌ నిరోధక కమిటీతో ఓ అవగాహన కుదుర్చుకుంది. టోర్నీ జరిగే సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మూడు విడతల్లో క్రికెటర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్ సహా స్టార్ క్రికెటర్లు 50 మంది నుంచి శాంపిళ్లను సేకరించనున్నారు.

ఐపీఎల్ లో డోపింగ్ ను నిరోధించేందుకు నాడా ఐదు డోప్ నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. మ్యాచులు నిర్వహించే దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియాల్లో మూడు డోప్ నియంత్రణ కేంద్రాలు ఉంటాయి. క్రికెటర్లు ప్రాక్టీస్ చేసే ఐసీసీ అకాడమీ, జాయెద్ క్రికెట్ జాయెద్ క్రికెట్ స్టేడియాల్లో మరో రెండు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని తెలిసింది. ఆడేటప్పుడు, సాధన సమయంలో క్రికెటర్లకు ఖచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తారని సమాచారం.

క్రికెటర్ల నుంచి మూత్రమేకాకుండా రక్త నమూనాలూ సేకరించేందుకు జాతీయ డోపింగ్ నిరోధక సంఘం మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. డోపింగ్ నిరోధానికి ఐదుగురు సభ్యులతో కూడిన మూడు బృందాలను జాతీయ డోపింగ్ నిరోధక సంఘం నియమించనుంది. ఈ బృందంలో నాడా సీనియర్ అధికారితోపాటు డీసీవో కేంద్రాల నుంచి ఇద్దరు, యూఏఈ యాంటీడోపింగ్ సభ్యులు ఇద్దరు ఈ టీమ్ లో ఉంటారు. విడతలవారీగా ఈ బృందాలు యూఏఈ చేరుకొని పరీక్షలు నిర్వహించనున్నాయి. మరోవైపు ఇప్పటికే ఐపీఎల్ క్రికెట్ జట్లు అక్కడికి చేరుకున్నాయి.