కొవాగ్జిన్ ట్రయల్ లాంచ్ ఎలా అవుతుంది ? ఈ వ్యాక్సిన్ ని ఎమర్జెన్సీలో ఉపయోగించవచ్చా ? కాంగ్రెస్ పార్టీ సూటి ప్రశ్న

భారత్ బయో టెక్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ పై కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సందేహాలను లేవనెత్తింది. ఈ టీకామందు ఇంకా మూడో దశ ట్రయల్స్ లోనే ఉందని,

  • Umakanth Rao
  • Publish Date - 4:03 pm, Wed, 13 January 21
కొవాగ్జిన్ ట్రయల్ లాంచ్ ఎలా అవుతుంది ? ఈ వ్యాక్సిన్ ని ఎమర్జెన్సీలో ఉపయోగించవచ్చా ? కాంగ్రెస్ పార్టీ సూటి ప్రశ్న

భారత్ బయో టెక్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ పై కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సందేహాలను లేవనెత్తింది. ఈ టీకామందు ఇంకా మూడో దశ ట్రయల్స్ లోనే ఉందని, అలాంటప్పుడు ఎమర్జెన్సీ వినియోగానికి ఎలా అర్హత పొందుతుందని ఈ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ ప్రశ్నించారు. ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి కాలేదు, దీని సామర్థ్యంపై పలు అనుమానాలు తలెత్తడం సహజమే..మొదట వాటిని తీర్చండి అని ఆయన ట్వీట్ చేశారు. మూడో దశ ట్రయల్ ని ఇలా అత్యవసరంగా వినియోగిస్తారా అన్నారు. భారతీయులు ‘గినియా పిగ్స్ (గినియా పందులు)’ కారు అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాక్సిన్ సేఫ్ అని, నాణ్యమైందని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందా అని కూడా మనీష్ తివారీ అన్నారు. అయితే సీరం సంస్థ వారి కోవిషీల్డ్ తరువాత భారత్ బయో టెక్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్నఈ టీకామందును కూడా బుధవారం దేశంలోని వివిధ నగరాలకు పంపిన సంగతి తెలిసిందే. ఇటీవల  కాంగ్రెస్ నేతలు కొందరు ఈ వ్యాక్సిన్ పై సందేహాలను లేవనెత్తారు. మనీష్ తివారీ మళ్ళీ ఆ విధమైన అనుమానాలను బయటపెట్టారు.

ఈనెల 16 నుంచి ఈ వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా సుమారు 3 కోట్లమంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లకు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోనే ఇదో బృహత్తర ప్రక్రియ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  కోవీషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లతో బాటు మరో నాలుగు టీకామందులు కూడా అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.


Read Also:కొవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ పురోగతిని ప్రకటించిన భారత్ బయోటెక్.. 26 వేల మందికి టీకా ఇవ్వడమే లక్ష్యం.
Read Also:కరోనా ఫైట్.. ఎన్ని దేశాలు వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయో తెలుసా. అవి ఏ దశ ప్రయోగాల్లో ఉన్నాయో తెలుసా..