సాకర్‌ మాంత్రికుడు డీగో మారడోనా ఇక లేరు.. గుండెపోటుతో మరణించిన ఫుట్ బాల్ దిగ్గజం

|

Nov 26, 2020 | 11:18 AM

సాకర్‌ మాంత్రికుడు డీగో మారడోనా.. హఠాత్తుగా కన్నుమూశారు. ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచాడు. వరల్డ్‌కప్‌ విజేత మారడోనా.. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. 60ఏళ్ల మారడోనా మెదడులో రక్తం..

సాకర్‌ మాంత్రికుడు డీగో మారడోనా ఇక లేరు.. గుండెపోటుతో మరణించిన ఫుట్ బాల్ దిగ్గజం
Follow us on

Diego maradona has died: సాకర్‌ మాంత్రికుడు డీగో మారడోనా.. హఠాత్తుగా కన్నుమూశారు. ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచాడు. వరల్డ్‌కప్‌ విజేత మారడోనా.. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. 60ఏళ్ల మారడోనా మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యాడు.

అయితే, బుధవారం మారడోనాకు గుండెపోటు రావడంతో తన ఇంట్లోనే మృతి చెందినట్టు అతడి లాయర్‌ తెలిపాడు. కెరీర్‌, జీవితంలో డీగో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. డ్రగ్స్‌ బారినపడి చావు అంచుల వరకు వెళ్లినా.. మళ్లీ రాగలిగాడు.

1986 మెగా టోర్నీలో జట్టుకు సారథ్యం వహించి అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ అందించారు. ఆ విశ్వటోర్నీ క్వార్టర్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై మారడోనా చేసిన గోల్‌.. శతాబ్దానికే అత్యుత్తమ గోల్‌గా చరిత్రలో నిలిచిపోయింది.

మరోపైపు బంతి  గోల్‌ చేయి తాకి నమోదైందన్న ఆరోపణలు కూడా తగిలిది. ఫేమస్‌ కావడంతో అది ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గానూ పేరుతెచ్చింది. అలాగే 1990 ప్రపంచకప్‌లోనూ అర్జెంటీనాను మారడోనా ఫైనల్‌కు చేర్చారు.

క్లబ్‌ కెరీర్‌లో బార్సిలోనా, నపోలీ తరఫున బరిలోకి దిగిన డిగో ఆ జట్లకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. నపోలీకి రెండు సిరీస్‌-ఏ టైటిళ్లను సాధించిపెట్టారు. 1991లో మాదక ద్రవ్యాలు వాడినట్టు డోప్‌ పరీక్షల్లో తేలడంతో మారడోనా 15 నెలల పాటు నిషేధానికి గురయ్యారు. ఆ తర్వాత 1994 ప్రపంచకప్‌లోనూ అర్జెంటీనాకు సారథ్యం వహించారు.