ట్రంప్ అభిశంసనకు మళ్ళీ సన్నాహాలు, రేపు సెనేట్ లో తీర్మాన ప్రతిపాదన, 20 న విచారణ !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు సెనేట్ సమాయత్తమైంది. సోమవారం సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడతామని....

ట్రంప్ అభిశంసనకు మళ్ళీ సన్నాహాలు, రేపు సెనేట్ లో తీర్మాన ప్రతిపాదన, 20 న విచారణ !
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Jan 10, 2021 | 10:35 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు సెనేట్ సమాయత్తమైంది. సోమవారం సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడతామని సెనెట్ మెజారిటీ లీడర్ మిచ్ మెక్ కానెల్ వెల్లడించారు. అభిశంసనకు సంబంధించిన విచారణ…. అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసే రోజున..ఈ నెల 20 న మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. క్యాపిటల్ హిల్ లో ఇటీవల తన మద్దతుదారులను రెచ్ఛగొట్టి, హింసాత్మక ఘటనలకు కారకుడయ్యాడనే ఆరోపణ మీద, జార్జియా ఎన్నికను సవాలు చేశాడనే అభియోగం మీద ట్రంప్ పై ఇంపీచ్ మెంట్ చర్యకు సెనేట్ సిధ్ధమైంది. కాగా అప్పుడే ఇందుకు సంబంధించిన తీర్మాన ప్రతిపై 180 మంది ఎంపీలు సంతకాలు చేశారు. తమ నేతను క్షమించి విడిచిపెట్టాలని, అభిశంసన యోచనను విరమించుకోవాలని ట్రంప్ మద్దతుదారులు స్పీకర్ నాన్సీ పెలోసీని, మిచ్ మెక్ కానెల్ ను అభ్యర్థించారు. అయితే పెలోసీ ఈ అభ్యర్థనను తొసిపుచ్చారు. రెండో సారి ఆయన ఇంపీచ్ మెంట్ తప్పదని హెచ్ఛరించారు.  ట్రంప్ పై అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణపై లోగడ  సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా నిర్దోషిగా ఆయన  బయటపడ్డారు.

మరోవైపు ..పదవికి ట్రంప్ అనర్హుడంటూ, ఆయన రాజీనామా చేయాలంటూ డెమొక్రాట్లు రాజ్యాంగంలోని 25 వ సవరణను ఉపయోగించుకునేందుకు  సమాయత్తమయ్యారు.ఇందుకు ఓ కమిటీని వారు ఏర్పాటు చేశారు. Read Also :Trump riots Democrats Plan:ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి తొలగిపోవాలని డెమొక్రాట్ల డిమాండ్.. Read Also :Trump riots Democrats Plan:ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి తొలగిపోవాలని డెమొక్రాట్ల డిమాండ్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu