15 ఏళ్లకే అత్యాచారానికి గురయ్యా.. కారణం మా “అమ్మే”: హాలీవుడ్ నటి

| Edited By:

Sep 25, 2019 | 8:46 AM

స్టార్ హీరోయిన్లకు కూడా చెప్పుకోలేని సంఘటనలు ఉంటాయని హాలీవుడ్ నటి డెమీ మూర్ అన్నారు. పిల్లలకు తల్లిదండ్రుల వద్ద రక్షణ వుంటుంది కాని అది కొంతమంది విషయంలోనే అని ఆమె చెప్పారు. ప్రతిఒక్కరి లైఫ్‌లో ఏదో ఒక చేదు అనుభవం ఉంటుందని.. కాని తన జీవితంలో జరిగిన ఓ విషాద ఘటనకు తన తల్లే కారణమని ఆమె ఓ షోలో ఆవేదన వ్యక్తం చేసింది. తాను టీనేజ్‌లో ఉన్నప్పుడే ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని.. దానికి […]

15 ఏళ్లకే అత్యాచారానికి గురయ్యా.. కారణం మా అమ్మే: హాలీవుడ్ నటి
Follow us on

స్టార్ హీరోయిన్లకు కూడా చెప్పుకోలేని సంఘటనలు ఉంటాయని హాలీవుడ్ నటి డెమీ మూర్ అన్నారు. పిల్లలకు తల్లిదండ్రుల వద్ద రక్షణ వుంటుంది కాని అది కొంతమంది విషయంలోనే అని ఆమె చెప్పారు. ప్రతిఒక్కరి లైఫ్‌లో ఏదో ఒక చేదు అనుభవం ఉంటుందని.. కాని తన జీవితంలో జరిగిన ఓ విషాద ఘటనకు తన తల్లే కారణమని ఆమె ఓ షోలో ఆవేదన వ్యక్తం చేసింది. తాను టీనేజ్‌లో ఉన్నప్పుడే ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని.. దానికి కారణం తన అమ్మే అని తెలిసి షాక్ అయ్యానన్నారు. మద్యం కోసం 500 వందల డాలర్లు తీసుకుని తనను బలిచేసిందని.. ఆ విషయం తెలుసుకున్న తను ఇంటి నుంచి బయటికి వచ్చేశానని తెలిపారు. తన దగ్గర డబ్బులు కూడా లేవని.. హాలీవుడ్‌లో సినిమా కెరీర్ ప్రారంభించడానికి చాలా కష్టాలు పడ్డానని చెప్పారు. కాగా, జనరల్ హాస్పిటల్ అనే టీవీ సిరీస్‌లో తన కెరీర్ మలుపు తిరిగిందని ఆమె చెప్పారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసే సమయం లేకుండా సినిమాల్లో బిజీ అయ్యానని డెమీ మూర్ తెలిపారు.