ఉత్తరాదిలో ముఖ్యంగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయినట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. హిమాలయాలు, ఉత్తరాది ప్రాంతాలనుంచి వస్తున్న శీతల గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంగళవారం ఈ నగరంలో కేవలం 3.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనట్టు ఈ శాఖ వెల్లడించింది., ఉత్తరాఖండ్, . హర్యానా, పంజాబ్, యూపీ, బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలన్నీ చలికి గజగజలాడుతున్నాయి. బుధ,గురు వారాల్లో ఢిల్లీలో రెండు కన్నా తక్కువ టెంపరేచర్ నమోదైనా ఆశ్చర్యం లేదంటున్నారు. రాజస్థాన్ లోని చురులో మంగళవారం మైనస్ 0.4 డిగ్రీల టెంపరేచర్ నమోదయింది. ఈ వాతావరణ మార్పుల కారణంగా పొగమంచు కూడా దట్టంగా కమ్ముకుంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ శీతా కాలంలో ప్రజలు చాలావరకు ఇళ్లలోనే ఉండాలని, జలుబు, ఫ్లూ వంటి రుగ్మతలు సోకుతాయని డాక్టర్లు హెచ్ఛరిస్తున్నారు. బయటకు వెళ్లే ముందు వెచ్చ్చని దుస్తులు ధరించాలని వారు సూచిస్తున్నారు.