దీపక్ హుడా మెరుపులు.. చెన్నై టార్గెట్ 154 పరుగులు

|

Nov 01, 2020 | 6:20 PM

దీపక్ హుడా 62 /30  హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడిన వేళ పంజాబ్‌ 154 పరుగుల టార్గెట్‌ను చెన్నై ముందుంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది...

దీపక్ హుడా మెరుపులు.. చెన్నై టార్గెట్ 154 పరుగులు
Follow us on

 KXIP Set 154-Run Target For CSK : దీపక్ హుడా 62 /30  హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడిన వేళ పంజాబ్‌ 154 పరుగుల టార్గెట్‌ను చెన్నై ముందుంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. పంజాబ్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్ అగర్వాల్‌ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించారు. ఎంగిడి బౌలింగ్‌లో మయాంక్‌ ఔటైనప్పటికీ పవర్‌ప్లేలో 53 పరుగులతో గొప్ప స్థితిలోనే నిలిచింది. అయితే తర్వాత చెన్నై బౌలర్లు పుంజుకుని స్వల్ప వ్యవధిలోనే రాహుల్‌, నికోలస్‌ పూరన్ , క్రిస్‌ గేల్‌ ను పెవిలియన్‌కు చేర్చారు.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్‌ హుడా ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చాడు. మన్‌దీప్‌ సింగ్‌ తో కలిసి తొలుత నిదానంగా ఆడిన హుడా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 26 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. చెన్నై బౌలర్లలో ఎంగిడి మూడు వికెట్లు, జడేజా, తాహిర్‌, శార్దూల్‌ తలో వికెట్ తీశారు.