కంగారులకు భారీ ఎదురుదెబ్బ… డేవిడ్​ వార్నర్‌కు​ గాయం..తొడ కండరానికి దెబ్బ తగిలినట్లు నిర్ధారించిన వైద్యులు

|

Nov 29, 2020 | 4:59 PM

టీమిండియాతో రెండో వన్డేలో ఆడుతున్న డేవిడ్​ వార్నర్​కు గాయమైంది. ​భారత బ్యాట్స్​మన్​ ధావన్​ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో ఈ దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది...

కంగారులకు భారీ ఎదురుదెబ్బ... డేవిడ్​ వార్నర్‌కు​ గాయం..తొడ కండరానికి దెబ్బ తగిలినట్లు నిర్ధారించిన వైద్యులు
Follow us on

భారత-ఆస్ట్రేలియా సిరీస్‌లో మంచి దూకుడు మీదున్న కంగారులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియాతో రెండో వన్డేలో ఆడుతున్న డేవిడ్​ వార్నర్​కు గాయమైంది. ​భారత బ్యాట్స్​మన్​ ధావన్​ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో ఈ దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. దీంతో మ్యాచ్​ మధ్యలోనే మైదానం నుంచి వెళ్లి పోయారు​. తొడ కండరానికి గాయమైనట్లు ఆసీస్​ జట్టు ఫిజిషియన్లు తెలిపారు.

స్కానింగ్​ చేశాక అతడి పరిస్థితిని చెబుతామని తెలిపారు. టాస్​ గెలిచి బ్యాటింగ్​ చేసిన ఆసీస్​.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 389 పరుగుల భారీ స్కోరు చేసింది. ‌స్మిత్‌ (104) మరోసారి సెంచరీతో చెలరేగగా.. డేవిడ్‌ వార్నర్‌ (83), ఆరోన్​ ఫించ్​ (60), లబుషేన్​ (70), మ్యాక్స్​వెల్(63) అద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శించారు.