అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ విజయానికి గుప్త నిధులు, డొనాల్డ్ ట్రంప్ కన్నా అత్యధిక విరాళాలు

అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ విజయానికి గుప్త నిధులే కారణమన్న ఓ వార్త వెలుగులోకి వచ్చింది.  ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం బయటి నుంచి..

  • Umakanth Rao
  • Publish Date - 11:44 am, Tue, 26 January 21
అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ విజయానికి గుప్త నిధులు, డొనాల్డ్ ట్రంప్  కన్నా  అత్యధిక విరాళాలు

అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ విజయానికి గుప్త నిధులే కారణమన్న ఓ వార్త వెలుగులోకి వచ్చింది.  ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం బయటి నుంచి అజ్ఞాత వ్యక్తులు విరాళాలుగా ఇచ్చిన నిధులు కొల్లలు, కొల్లలట. అంటే వైట్ హౌస్ పై పట్టు సాధించాలంటే ఎవరు ఈయనకు సాయపడ్డారన్నది ప్రజలకు పూర్తి వివరాలు తెలియకుండా పోయిందన్న మాట.. బైడెన్ ప్రచార వర్గానికి 145 మిలియన్ డాలర్ల  డార్క్ మనీ (గుప్త నిధులు) డొనేషన్ గా అందినట్టు తెలుస్తోంది. ఇలాంటిదేమీ లేదని డెమొక్రాట్లు కొట్టిపారేస్తున్నారు. జో బైడెన్ తన ప్రచారానికి 1.5 బిలియన్ డాలర్లను వెచ్చించారట. నిజానికి ఈయన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ కి ఇలా 28.4 మిలియన్ డాలర్లు గుప్త నిధులుగా అందినట్టు చెబుతున్నారు. 2012 లో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినీ మిట్ రోమ్నీ కి 113 మిలియన్ డాలర్ల డార్క్ మనీ అందినట్టు అమెరికాలో ఈ వ్యవహారాలను చూసే ఓ కమిటీ వెల్లడించింది. ఒక విధంగా ఇది అవినీతి సొమ్మేనని డెమొక్రాట్లు అంటున్నప్పటికీ ట్రంప్ ను ఓడించాలంటే ఈ విధమైన నిధులు అవసరమేనని వారు అంతరంగికంగా అంగీకరిస్తున్నారు.

ఈ డార్క్ మనీ వల్ల బైడెన్ ప్రయోజనమే పొందారని ఫెడరల్ ఎలెక్షన్ కమిషన్ మాజీ జనరల్ కౌన్సెల్ లారీ నోబెల్ వ్యాఖ్యానించారు. కానీ బైడెన్ తరఫు ప్రతినిధి మాత్రం నో కామెంట్ అంటున్నారు. తన ప్రచారం కోసం బైడెన్ ఎంత వెచ్చించారు, గుప్త నిధులు ఎంత అందాయన్నది ఈ కమిటీ బేరీజు వేసింది. ఎన్నికల్లో పోటీ చేసే ఓ అభ్యర్థి 2,800 డాలర్ల వరకు విరాళాలను అంగీకరించవచ్ఛు. ఒక్కొక్కరు 200 డాలర్లు చొప్పున డోనర్లు  ఇచ్ఛే 318.6 మిలియన్ డాలర్లు కూడా ఇందులో చేరి ఉంది.