ఏఎస్ఐ కుటుంబానికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆర్థిక సాయం

విధి నిర్వహణ లో ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ సోమ్లా నాయక్ కుటుంబానికి సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ అండగా నిలిచారు.

ఏఎస్ఐ కుటుంబానికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆర్థిక సాయం

Edited By:

Updated on: Sep 30, 2020 | 8:43 PM

విధి నిర్వహణ లో ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ సోమ్లా నాయక్ కుటుంబానికి సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ అండగా నిలిచారు. శోకసంద్రం ఉన్న ఆ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. రంగారెడ్డి నందిగామ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ సోమ్లా నాయక్ ప్రాణాలను కోల్పోయారు. విధి నిర్వహణలో ఉండగా 2018 జూన్ 15వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. కాగా, ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు రూ. 5 లక్షలు బుధవారం సీపీ సజ్జనార్ ఆయన కూతుర్లు సౌజన్య, సౌమ్య కు అందజేశారు. కుటుంబసభ్యులను అన్ని విధాలుగా అండ ఉంటానని సీపీ హామీ ఇచ్చారు.  ఏఎస్ఐ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నందుకు సీపీ సజ్జనార్ కు పోలీస్ అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది.

Follow Us