‘కరోనా భూతం ప్రపంచానికే ప్రమాదం’.. వరల్డ్ హెల్త్ ‘హెడ్’ వార్నింగ్

| Edited By: Anil kumar poka

Feb 12, 2020 | 7:25 AM

కరోనా వైరస్ ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఎంతో ప్రమాదకరమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రేసెస్ హెచ్ఛరించారు. ముఖ్యంగా చైనా తక్షణమే ఈ వైరస్ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని దేశాలు ఈ వైరస్ సాంపిల్స్ సేకరించాలని, దీని  నివారణకు అవసరమైన మందులు,  వ్యాక్సీన్లను కనుగొనే క్రమంలో పరిశోధనలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. చైనాలో 99 శాతం కేసులు ఆ దేశానికి చాలా డేంజర్ అని పేర్కొన్నఆయన..  ఇతర దేశాలు […]

కరోనా భూతం ప్రపంచానికే ప్రమాదం.. వరల్డ్ హెల్త్ హెడ్ వార్నింగ్
Follow us on

కరోనా వైరస్ ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఎంతో ప్రమాదకరమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రేసెస్ హెచ్ఛరించారు. ముఖ్యంగా చైనా తక్షణమే ఈ వైరస్ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని దేశాలు ఈ వైరస్ సాంపిల్స్ సేకరించాలని, దీని  నివారణకు అవసరమైన మందులు,  వ్యాక్సీన్లను కనుగొనే క్రమంలో పరిశోధనలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.

చైనాలో 99 శాతం కేసులు ఆ దేశానికి చాలా డేంజర్ అని పేర్కొన్నఆయన..  ఇతర దేశాలు కూడా ఇప్పుడే మేల్కొనవలసి ఉందన్నారు. దాదాపు 400 మంది రీసెర్చర్లు, ఆయా దేశాల వైద్య అధికారులు, ప్రొఫెసర్లు పాల్గొన్న సమావేశాన్ని ఉద్దేశించి జెనీవాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెడ్రోస్ ప్రసంగించారు. చైనా, తైవాన్ దేశాలకు చెందిన పరిశోధకులు కూడా వీరిలో ఉన్నారు. వాల్డ్ వైడ్ గా 43 వేల మందికి పైగా రోగులకు ఈ ఇన్ఫెక్షన్ . సోకింది. వెయ్యి మందికి పైగా మరణించినట్టు వార్తలు అందుతున్నాయి అన్నారాయన. ఆఫ్రికా, ఆసియా దేశాలు పేద దేశాలని, ఈ వైరస్ నివారణకు అయ్యే ఖర్చులను భరించలేవని ఆయన చెప్పారు. ఈ దేశాలకు ముప్పు మరింత ఎక్కువగా ఉందని అన్నారు. మొదట ఈ మహమ్మారిని అత్యవసరంగా అదుపు చేసి లక్షలాదిమందిని  కాపాడవలసిఉందని చెప్పారు. దాదాపు 30 దేశాలకు ఈ వైరస్ వ్యాపించిన విషయాన్ని గుర్తు చేశారు.