Telangana Congress: రేణుకా వర్సెస్ భట్టి.. ఖమ్మం కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో రగడ.. మంత్రుల సమక్షంలో..

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ముగ్గురు మంత్రుల సాక్షిగా ఖమ్మం కాంగ్రెస్‌ శ్రేణులు బాహాబాహీకి దిగారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఖమ్మం పార్లమెంట్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రేణుకా చౌదరి హాజరయ్యారు.

Telangana Congress: రేణుకా వర్సెస్ భట్టి.. ఖమ్మం కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో రగడ.. మంత్రుల సమక్షంలో..
Khammam Congress
Follow us

|

Updated on: Apr 30, 2024 | 3:52 PM

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ముగ్గురు మంత్రుల సాక్షిగా ఖమ్మం కాంగ్రెస్‌ శ్రేణులు బాహాబాహీకి దిగారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఖమ్మం పార్లమెంట్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రేణుకా చౌదరి హాజరయ్యారు. ఈ క్రమంలో ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు ఈ గొడవకు కారణమైంది. దీంతో ముగ్గురు మంత్రుల సమక్షంలోనే రగడ కొనసాగింది. కొందరు పని తక్కువ చేస్తూ..ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారని, ఈ సమావేశానికి కొందరు మండల అధ్యక్షులు కూడా రాలేదని రేణుకా చౌదరి అన్నారు. అయితే రేణుకాచౌదరి ప్రసంగాన్ని అడ్డుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ వర్గీయులు.. దీంతో ఇరు వర్గాలు గొడవకు దిగాయి.

కాంగ్రెస్‌ సమావేశం రేణుకా చౌదరి వర్సెస్‌ భట్టి విక్రమార్కగా మారిపోవడంతో అక్కడే ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకొని కార్యకర్తలకు సర్ది చెప్పారు.

వీడియో చూడండి..

ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అందరూ సమిష్టి కృషితో పనిచేయాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..