ఈసారి టైటిల్ పక్కా అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాన్ కోహ్లీ కొండంత ఆత్మవిశ్వాసంతో చెబుతుంటే.. మాజీ క్రికెటర్, కామంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం ఆర్‌సీబీ కప్పు గెలవడం అసాధ్యమంటూ గాలి తీస్తున్నాడు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లులో బ్యాటింగ్ స్ట్రెంత్ లేనేలేదంటున్నాడు.. పైగా ఆ జట్టులో సరైన బ్యాటింగ్ లైనప్ ఎక్కడుందని, బ్యాటింగ్‌లో డెత్ ఓవర్ల వరకు ఉండే లైనప్ ఉందా అసలు అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్‌లు దురదృష్టవశాత్తూ సరిగ్గా ఆడలేదనుకుందాం, ఆ తర్వాత పరిస్థితి ఏమిటని అంటున్నాడు చోప్రా. మెయిన్ అలీ, శివం దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి వాళ్లు ఉన్నా.. భారమంతా వారిపై వేయలేమన్నాడు.. క్రిస్ మోరిస్ కూడా బెస్ట్ బ్యాట్స్‌మనేమీ కాదని తేల్చేశాడు. బ్యాటింగ్‌లోనే కాదు, బౌలింగ్‌లోనూ బలహీనతలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు చోప్రా. టీమ్‌లో డెత్ ఓవర్ల బౌలర్లు ఎవరూ లేరని, డేల్ స్టెయిన్ కూడా డెత్ ఓవర్ల బౌలర్ కాదని చెబుతున్నాడు చోప్రా. నవదీప్ సైనీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌లు కూడా గట్టి బౌలర్లు కాదన్నాడు.. అసలు ఆర్‌సీబీ ఫ్రాంచేజ్ వేలంలో సరైన ఆటగాళ్లను తీసుకోలేదని, ఎవరిని తీసుకోవాలనే దానిపై అవకాగాహన లేదని తెలిపిన చోప్రా… ఇంత బలహీనమైన జట్టుతో టోర్నమెంట్‌లో ఎలా నెట్టుకొస్తుందో తెలియడం లేదని చెప్పాడు..