No Retirement plan: ఇప్పట్లో ఆ ఆలోచనలేదు.. రిటైర్‌మెంట్‌పై స్పందించిన క్రిస్‌ గేల్‌..

Chris Gayle On Retirement: తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లను ముచ్చెమటలు పట్టిస్తుంటాడు వెస్ట్‌ ఇండిస్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌ గేల్‌. టీమ్‌తో సంబంధం లేకుండా...

No Retirement plan: ఇప్పట్లో ఆ ఆలోచనలేదు.. రిటైర్‌మెంట్‌పై స్పందించిన క్రిస్‌ గేల్‌..
Follow us

|

Updated on: Jan 02, 2021 | 6:27 PM

Chris Gayle On Retirement: తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లను ముచ్చెమటలు పట్టిస్తుంటాడు వెస్ట్‌ ఇండిస్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌ గేల్‌. టీమ్‌తో సంబంధం లేకుండా గేల్‌ బ్యాటింగ్‌కు క్రికెట్‌ అభిమానులు అంతా ఫిదా అవుతుంటారు. మరీ ముఖ్యంగా ఐపీఎల్‌ మ్యాచ్‌లలో గేల్‌ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం 41 ఏళ్లున్న గేల్‌ తన రిటైర్‌మెంట్‌ వార్తలపై ఆసక్తికరంగా స్పందించాడు. ‘క్రికెట్‌ నుంచి మీరెప్పుడు రిటైర్‌మెంట్‌ అవుతున్నారని’ మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఇప్పట్లో రిటైర్‌మెంట్‌ అనే ప్రస్తావనే లేదు. నేను ఇంకో ఐదేళ్లు క్రికెట్‌లో కొనసాగుతానన్న భావన నాలో ఉంది. 45 ఏళ్ల వరకు రిటైర్‌ అవ్వను. కాబట్టి నేను ఇంకో రెండు వరల్డ్‌ కప్‌లను (ట్వంటీ ట్ంటీ) సులభంగా ఆడగలను’ అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే గేల్‌ ప్రస్తుతం దుబాయ్‌ వేదికగా వినూత్న కాన్సెప్ట్‌తో జరుగుతోన్న ‘అల్టిమేట్‌ క్రికెట్‌ ఛాలెంజ్‌’లో పాల్గొంటున్నాడు.

ఇక కొత్తేడాదిని పురస్కరించుకొని గేల్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలపాడు. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. ‘మీ జీవితాలను వెలుగులతో నింపుకోండి. ఛీర్స్ టూ 2021’ అంటూ క్యాప్షన్ జోడించాడు.

Also Read: Covid Vaccine.. Aadhar Number, OTP: వ్యాక్సిన్ కోసం మీ ఆధార్ నెంబ‌ర్‌, ఓటీపీ అడుగుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌