రోడ్డుపై నడిచే సమయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ప్రమాదాలు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా రావచ్చు. గతేడాది దేశంలో కొన్ని లక్షల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగాయని, లక్ష మందికి పైగా చనిపోయారని, గాయపడ్డ వారి సంఖ్య కూడా భారీగానే ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇందులో 56 శాతానికి పైగా అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, ఓవర్ టేకింగ్ కారణంగా 26 శాతానికి పైగా ప్రమాదాలు జరిగినట్లు తెలిపింది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ (Viral) అవుతోంది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోనప్పటికీ ఓ చిన్నారి మాత్రం రెప్పపాటు కాలంలో ప్రాణాలతో బయటపడ్డాడు. చిన్నారి రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అటువైపు నుంచి వేగంగా మరో లారీ దూసుకువచ్చింది. అది నేరుగా బాలుడికి ఎదురుగా వెళ్లింది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై సడన్ బ్రేక్ వేయడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు.
ఈ వీడియోలో కొందరు బస్సులో నుంచి దిగడం, అందులో కొందరు పిల్లలు కూడా ఉండడం గమనించవచ్చు. ఇంతలో, ఒక పిల్లవాడు అకస్మాత్తుగా పరిగెత్తడం ప్రారంభించాడు. రహదారిని దాటడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలోనే ఈ ఘటన జరుగుతుంది. గుండె దడ పుట్టించే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 8 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. వేల మంది వీడియోను లైక్ చేశారు. ‘పిల్లలు ఒంటరిగా రోడ్డు దాటకూడదు’ , వారికి తోడుగా పెద్దలు ఉండాలి’ ఇలా వారికి తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.
Brake system! ??pic.twitter.com/xilZwyowF5
— Figen (@TheFigen) August 7, 2022
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి