వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!

|

Nov 21, 2020 | 12:22 PM

ఐపీఎల్ 2021 ముందు మెగా ఆక్షన్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై డిసెంబ‌ర్‌లో తుది నిర్ణయం తీసుకోనుండగా..

వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!
Follow us on

Chennai Super Kings: ఐపీఎల్ 2021 ముందు మెగా ఆక్షన్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై డిసెంబ‌ర్‌లో తుది నిర్ణయం తీసుకోనుండగా.. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు మరో జట్టును కూడా చేర్చబోతున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. దీనితో మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.

ఐపీఎల్ 14వ సీజన్‌లో తొమ్మిది జట్లు పాల్గొంటాయి కాబట్టి మెగా ఆక్షన్‌‌లో మరోసారి ఫ్రాంచైజీలు కొత్తగా పలువురు క్రికెటర్లను బిడ్డింగ్ ద్వారా దక్కించుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే చాలామంది స్టార్ ప్లేయర్స్‌ను ఆక్షన్‌లోకి రాబోతున్నారు. మరోవైపు తమ స్ట్రెంగ్త్‌ను మరింతగా పెంచుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి అగ్రశ్రేణీ ఆటగాళ్లపై గురి పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది పేలవ ప్రదర్శన కనబరిచిన కేదార్ జాదవ్, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వెన్ బ్రేవో, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, పీయూష్ చావ్లా, శార్దూల్ ఠాకూర్‌లను రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని కూడా బిడ్డింగ్‌లో మరోసారి కొనుగోలు చేయాలనుకుంటున్నారని సమాచారం.  అలాగే డుప్లెసిస్‌కు కెప్టెన్సీ బాధ్యతను అప్పగించనున్నట్లు టాక్.

Also Read: ఆ ఐదుగురి ప్లేయర్స్‌పై ఆర్సీబీ కన్ను.. వచ్చే ఐపీఎల్‌కు బెంగళూరు జట్టులో సన్‌రైజర్స్ ఆటగాడు.?