చంద్రబాబుకు ఎయిర్ పోర్ట్‌లో షాక్

| Edited By: Pardhasaradhi Peri

Jun 15, 2019 | 10:05 AM

అధికారంలో ఉన్నంత వరకే ఏదైనా.. అనేది రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే నానుడి! దీనికి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విషయంలోనూ ఇదే నిజమైంది. శనివారం సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు పయనమయ్యారు. అయితే విమానాశ్రయంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. సామాన్యుడి మాదిరిగానే ఆయనను కూడా తనిఖీలు చేశారు ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది. దీంతో అధికారుల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. అధికారుల వ్యవహారశైలి […]

చంద్రబాబుకు ఎయిర్ పోర్ట్‌లో షాక్
Follow us on

అధికారంలో ఉన్నంత వరకే ఏదైనా.. అనేది రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే నానుడి! దీనికి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విషయంలోనూ ఇదే నిజమైంది.

శనివారం సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు పయనమయ్యారు. అయితే విమానాశ్రయంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. సామాన్యుడి మాదిరిగానే ఆయనను కూడా తనిఖీలు చేశారు ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది. దీంతో అధికారుల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. అధికారుల వ్యవహారశైలి సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే మాజీ సీఎం చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరి కింద తనిఖీల విషయంలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఆయన వాహనాన్ని లోపలికి అనుమతించలేదు. ఎయిర్ పోర్ట్ లాంజ్ వరకు ప్రయాణికుల బస్సులోనే చంద్రబాబు వెళ్లారు.