చిన్న నగరాల్లోనూ మెట్రో రైలు

దేశంలోని పెద్ద పెద్ద నగరాల్లో మెట్రో రైలుకు ఆదరణ పెరుగుతుండటంతో.. చిన్న నగరాలు, పట్టణాల్లోనూ మెట్రో రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిన్న రైళ్లను రహదారులకు ఆనుకుని నడిపేవిధంగా కేంద్రం ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకుగాను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ విధివిధానాలను నిర్దేశించింది. ప్రస్తుతానికి అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే నగరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో మెట్రో నెట్‌వర్క్‌ను 50 […]

చిన్న నగరాల్లోనూ మెట్రో రైలు
Follow us

| Edited By:

Updated on: Jul 22, 2019 | 7:43 AM

దేశంలోని పెద్ద పెద్ద నగరాల్లో మెట్రో రైలుకు ఆదరణ పెరుగుతుండటంతో.. చిన్న నగరాలు, పట్టణాల్లోనూ మెట్రో రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిన్న రైళ్లను రహదారులకు ఆనుకుని నడిపేవిధంగా కేంద్రం ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకుగాను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ విధివిధానాలను నిర్దేశించింది. ప్రస్తుతానికి అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే నగరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో మెట్రో నెట్‌వర్క్‌ను 50 నగరాలకు విస్తరించనున్నట్లు పేర్కొంది. ఇందుకు అనుగుణంగా మెట్రో రైలు సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది.

Latest Articles