విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న టాప్ హిట్ మూవీస్ ఇవే 

Phani.ch

18 May 2024

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టైర్ 1లో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉన్న టైర్ 2 హీరో. 

అయితే విజయ్ దేవరకొండను వరుస పరాజయాలు వేధిస్తున్నాయి అనే చెప్పాలి. దీనికి ముఖ్య కారణం స్క్రిప్ట్ సెలక్షన్.

అయితే అర్జున్ రెడ్డి మూవీ తర్వాత ఆయన ఓ నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలను రిజెక్ట్ చేశాడు. అవి చేసి ఉంటే ఇప్పుడు స్టార్ హీరోల సరసన చేరేవాడు.

దర్శకుడు అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 కోసం మొదట శర్వానంద్ ని అనుకున్నాడట. రొమాంటిక్ సన్నివేశాల డోస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన రిజెక్ట్ చేశాడట.

తర్వాత విజయ్ దేవరకొండను సంప్రదిస్తే ఆయన కూడా రిజెక్ట్ చేశాడట. అర్జున్ రెడ్డి షేడ్స్ ఉన్నాయనే కారణంతో ఆర్ఎక్స్ 100 చేయడానికి విజయ్ దేవరకొండ ఆసక్తి చూపలేదట. 

రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ . ఈ కథకు పూరి జగన్నాధ్ ఊహించుకున్న హీరో విజయ్ దేవరకొండ.

మూవీలో హీరో క్యారెక్టర్ డ్యూయల్ షేడ్స్ కలిగి ఉంటుంది. అందుకే విజయ్ దేవరకొండ ఇస్మార్ట్ శంకర్ స్క్రిప్ట్ రిజెక్ట్ చేశాడట. 

నితిన్-రష్మిక మందాన కాంబోలో విడుదలైన భీష్మ సూపర్ హిట్. ఈ స్క్రిప్ట్ మొదట విజయ్ దేవరకొండకు వినిపించాడట వెంకీ కుడుముల. విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించాడట.

విజయ్ దేవరకొండ వదులుకున్న మరో బ్లాక్ బస్టర్ ఉప్పెన.  విజయ్ దేవరకొండను దృష్టిలో ఉంచుకుని కథ రాసుకున్నాడట. విజయ్ దేవరకొండ ఈ స్క్రిప్ట్ రిజెక్ట్ చేశాడట.