ఈ సినిమాలకు కాదు.. పాటలకు పట్టం..

TV9 Telugu

18 May 2024

అజ్ఞాతవాసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కెరీర్స్ బిగ్గెస్ట్ డిజాస్టర్. అయితే సినిమాలో పాటలు మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యాయి.

రామ్ చరణ్ నటించిన ప్లాప్ చిత్రం ఆరంజ్. ఈ సినిమాకు హారిస్ జయరాజ్అందించిన మ్యూజిక్ వింటే వావ్ అనాల్సిందే.

ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా కూడా ఈ జాబితాలో ఉంది. జస్టిన్ ప్రభాకరన్ అందంచిన సంగీతం చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది.

రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా కనిపించిన ది వారియర్ సినిమా ప్లాప్ అయినప్పటికీ దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఆకట్టుకున్నాయి.

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా పాటలకు ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు.

మహేష్ బాబు సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఒకటి నేనొక్కడినే నష్టాలు మిగిల్చినప్పటికి సాంగ్స్ మాత్రం దుమ్ములేపాయి.

అక్కినేని వారసుడు అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్ జంట తెరకెక్కిన హలో ప్లాప్ అయింది. సాంగ్స్ మాత్రం ఆకట్టుకున్నాయి.

బన్నీ కెరీర్ లో ప్లాప్ గా నిలిచిన సినిమా బద్రినాథ్. ఈ సినిమా పాటలు మాత్రం సంగీత ప్రియులను మెప్పించాయి.