తరుణ్‌ రీఎంట్రీపై గుడ్‌ న్యూస్‌

Phani.ch

18 May 2024

లవర్‌ బాయ్‌ తరుణ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా కాలంగా సినిమాలకు దూరమయ్యాడు. రీఎంట్రీకి సంబంధించిన ఆ మధ్య చాలా వార్తలొచ్చాయి.

కానీ అవన్నీ రూమర్లుగానే మిగిలాయి. మరి ఇంతకి తరుణ్‌ రీఎంట్రీ ఉంటుందా? లేదా అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.

ఈ నేపథ్యంలో తరుణ్‌ తల్లి, అలనాటి నటి రోజా రమణి దీనిపై స్పందించింది. అభిమానులకు గుడ్ న్యూస్‌ చెప్పింది.

తరుణ్‌ 2014 వరకు యాక్టీవ్‌గా ఉన్నాడు. చివరగా ఆయన `వేట` చిత్రంలో నటించారు. శ్రీకాంత్‌తో కలిసి ఈ మూవీ చేశాడు. పెద్దగా ఆడలేదు. 

ఈ నేపథ్యంలో తాజాగా తరుణ్‌ అమ్మ, సీనియర్‌ నటి రోజా రమణి స్పందించింది. తరుణ్‌ రీఎంట్రీకి సంబంధించిన గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

త్వరలోనే తరుణ్‌ మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్లాన్స్ జరుగుతున్నాయట.

త్వరలోనే ఆ గుడ్‌ న్యూస్‌ రాబోతుందని ఆమె వెల్లడించింది. ఎలాంటి సినిమాతో రావాలి, ఎలాంటి కథలు చేయాలనేది వర్క్ జరుగుతుందని కచ్చితంగా సర్‌ప్రైజింగ్ గా ఉండబోతుందని రోజా రమణి వెల్లడించారు.