పెళ్లికి ముందే వరుడి వక్రబుద్ధి…

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిపైనే వేధింపులకు పాల్పడ్డాడు ఓ పోకిరి పెళ్లికొడుకు. వాడి వక్రబుద్ధిని పసిగట్టిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో చివరకు శ్రీ కృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది.

పెళ్లికి ముందే వరుడి వక్రబుద్ధి...

Updated on: Feb 27, 2020 | 6:13 PM

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిపైనే వేధింపులకు పాల్పడ్డాడు ఓ పోకిరి పెళ్లికొడుకు. వాడి వక్రబుద్ధిని పసిగట్టిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో చివరకు శ్రీ కృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. కృష్ణా జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలు పరిశీలించగా…

జిల్లాలోని అవనిగడ్డకు చెందిన యువతితో గుంటూరు జిల్లాకు చెందిన యువకుడికి పెళ్లి ఖాయమైంది. ఇరువురి కుటుంబీకుల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిపించారు. ఇక్కడే సదరు పెళ్లి కొడుకు అసలు స్వరూపం బయటపడింది. ఇద్దరికి త్వరలోనే పెళ్లి జరగనుందన్న చనువుతో పెళ్లికూతురితో చనువుగా ఉండటం మొదలుపెట్టాడు. తరచూ ఫోన్లు చేయటం, ఏకాంతంగా కలవలాని కోరటం మొదలు పెట్టాడు. అయితే, కాబోయే భర్తే కదా అనుకున్న ఆ యువతి కూడా మొదట్లో అభ్యంతరం చెప్పలేదు. దీంతో రెచ్చిపోయిన అతగాడు..తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. కలసిన ప్రతిసారి తీయకూడని ఫోటోలు, వీడియోలు తీసేవాడు. తన కోరిక తీర్చాలని వెంటపడుతుండటంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పుకుంది. యువకుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అతడ్ని పిలిచి మందలించారు. తన నిజస్వరూపం తెలుసుకుని జరిగిన నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. దీంతో యువతిపై కక్ష పెంచుకున్నాడు. గతంలో ఇద్దరు సన్నిహితంగా మెలిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బ్లాక్ మెయిల్ కు దిగాడు. దీంతో వాడి వేధింపులు తాళలేక బాధితురాలి తల్లిదండ్రులు అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us