పైసాకే బిర్యానీ..ఎగబడ్డ జనం

|

Oct 19, 2020 | 5:53 PM

కొత్త దుకాణాలు, మాల్స్ ఓపెన్  చేసేటప్పుడు యాజమాన్యాలు ప్రమోషన్ కోసం ఊహించని ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. దీంతో ఒక్క రోజులో సదరు షాప్ లేదా మాల్‌కి అమితమైన పబ్లిసిటీ వస్తుంది.

పైసాకే బిర్యానీ..ఎగబడ్డ జనం
Follow us on

కొత్త దుకాణాలు, మాల్స్ ఓపెన్  చేసేటప్పుడు యాజమాన్యాలు ప్రమోషన్ కోసం ఊహించని ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. దీంతో ఒక్క రోజులో సదరు షాప్ లేదా మాల్‌కి అమితమైన పబ్లిసిటీ వస్తుంది. తాజాగా కొత్త షాపు ప్రారంభం సందర్భంగా చెన్నైలోని ప్యారిస్‌లో పైసాకే బిర్యానీ అందించారు. దీంతో ప్రజలు భారీ ఎత్తున సదరు షాపు ముందు గుమిగూడారు. సీర్కాళి నూతన బస్టాండు వద్ద ఆదివారం నూతనంగా దుకాణాన్ని స్టార్ట్ చేశారు. వినియోగదారులను ఆకర్షించే విధంగా పైసా, 2, 3, 5, 10, 20 పైసలు ఇచ్చి బిర్యానీ తీసుకోవచ్చని అనౌన్స్ చేశారు. అందునా మొదటి మూడు వందల మందికి ఈ  చాన్స్ ఉంటుందని నిబంధన పెట్టారు. దీంతో ప్రజలు ఎగబడ్డారు. వారిని కంట్రోల్ చెయ్యడానికి యాజమాన్యం అష్టకష్టాలు పడింది.

Also  Read : కొండెక్కిన కూరగాయల ధరలు