వైరల్ వీడియో: వరదలో కొట్టుకు పోయిన స్కూల్ బిల్డింగ్..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. అందులోనూ బీహార్ వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా అక్కడ కురిసిన భారీ వర్షాలకు కోషి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ఉధృతికి నేల కోతకు గురి కావడంతో..

వైరల్ వీడియో: వరదలో కొట్టుకు పోయిన స్కూల్ బిల్డింగ్..

Updated on: Jul 14, 2020 | 5:07 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. అందులోనూ బీహార్ వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా అక్కడ కురిసిన భారీ వర్షాలకు కోషి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ఉధృతికి నేల కోతకు గురి కావడంతో నది ఒడ్డున ఉన్న ఓ ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్ చూస్తుండగానే కుప్ప కూలిపోయింది. భవన శిథిలాలు కూడా నదిలో కొట్టుకుపోయాయి. ఈ సంఘటన భగల్ పూర్‌లో జరిగింది. కరోనా లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. స్కూల్ భవనం నదిలోకి జారిపోతున్న దృశ్యాన్ని అక్కడే ఉన్న కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us